PM Kisan Samman Nidhi: ‘పీఎం కిసాన్’ నిధుల విడుదల.. రూ.18,880 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) 23వ విడత నిధుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది.
Pm kisan scheme 23rd installment released by pm modi
- పీఎం కిసాన్ నిధులు విడుదల.
- రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ.
- ప్రధాని మోదీ నిధులను విడుదలచేసారు.
PM Kisan Samman Nidhi: దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) 23వ విడత నిధుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుండి శనివారం (జూన్ 20, 2026) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఈ విడత ద్వారా దేశంలోని 9.44 కోట్లకు పైగా రైతు కుటుంబాల ఖాతాల్లోకి సుమారు రూ. 18,880 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతిలో నేరుగా జమ కానున్నాయి. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున, ఏడాదికి మొత్తం రూ. 6,000 ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా అందిస్తోంది.
గత మార్చి 13న అస్సాంలోని గువహటి నుండి 22వ విడత కింద రూ. 18,640 కోట్లను 9.32 కోట్ల మంది రైతులకు ప్రధాని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా విడతతో కలుపుకుని, ఇప్పటివరకు ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా దేశంలోని అన్నదాతలకు మొత్తం రూ. 4.25 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని పంపిణీ చేసినట్లయింది.
