×
Ad

క్యాబినెట్‌లో ఆ రెండు పోస్టులను భర్తీ చేయబోతున్నారా? వీరిద్దరికి నామినేటెడ్ పోస్టులు..! ముగ్గురికి ఉద్వాసన?

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకుంటే..ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్ రెడ్డిని త‌ప్పించే అవ‌కాశం లేక‌పోలేదట.

Revanth Reddy

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో భారీ మార్పుల‌కు ముహూర్తం ద‌గ్గర ప‌డుతుందా.? అంటే అవున‌నే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడింట్‌గా ఉన్న అజారుద్దీన్‌ను..జూబ్లీహిల్స్ బైఎలక్షన్ ఈక్వేషన్‌లో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంద‌రి అంచనాల‌ను త‌ల‌కిందులు చేస్తూ..చ‌కాచకా అజార్‌ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇక ఇప్పుడు అజారుద్దీన్ రాక‌తో..ఇక క్యాబినెట్‌లో మిగిలిన ఖాళీలు రెండే. వాటిని కూడా భ‌ర్తీ చేయాల‌ని సీఎం రేవంత్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారట. జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌..పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారట రేవంత్ రెడ్డి. అజార్ ఎంట్రీకి ముందున్న మూడు బెర్తుల పీటముడిని.. ఇప్పుడు రెండింటికి తగ్గించారు. (Revanth Reddy)

అయితే కొత్తగా ఇద్దరిని క్యాబినెట్‌లోకి తీసుకునే స‌మ‌యంలోనే మంత్రివర్గ ప్రక్షాళ‌న చేయాల‌ని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇందుకోసం హైక‌మాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఉన్న మంత్రుల ప‌నితీరు ఆధారంగా..చేరిక‌లు-తీసివేత‌లు ఉంటాయ‌న్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మంత్రుల వర్క్‌ ప్రోగ్రెస్‌పై ఢిల్లీకి రిపోర్టులు చేరిన‌ట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: కల్వకుంట్ల కవిత న్యూ లుక్, న్యూ స్టైల్‌.. కట్టూబొట్టూ మార్చేసి.. ఖరీదైన వాచ్‌కు బదులు మట్టి గాజులు.. ఎందుకంటే?

అయితే క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న రెండు పోస్టులు దక్కేదెవరికి అన్నదానిపై ఇప్పుడు పోలిటిక‌ల్ స‌ర్కిల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. మంత్రి ప‌దవి ఆశావహుల లిస్ట్‌ పెద్దగానే ఉంది. అయితే అమాత్య రేసులో ఉన్న ఇద్దరు సీనియర్ నేతలను రేవంత్ రెడ్డి..వ్యూహాత్మకంగా సైడ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

ఇద్దరిని క్యాబినెట్ రేస్ నుంచి త‌ప్పించారా?
సుద‌ర్శన్‌రెడ్డికి క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ స‌ల‌హాదారు పదవి ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును సివిల్ స‌ప్లై కార్పొరేష‌న్ ఛైర్మన్‌ను చేశారు. అలా ఇద్దరిని క్యాబినెట్ రేస్ నుంచి త‌ప్పించినట్లు అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహ‌న్ రెడ్డి రేసులో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చి ఉండటంతో ఆయనకు దాదాపుగా క్యాబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. ఇక మిగ‌తా వారికి చీఫ్‌ విప్‌తో పాటు ఇతర ప‌ద‌వుల‌ను క‌ట్టబెడుతారని అంటున్నారు.

అయితే క్యాబినెట్‌ ప్రక్షాళ‌న‌లో భాగంగా..ఇద్దరు లేదా ముగ్గురి పదవి ఊస్ట్ అయ్యే అవకాశం ఉందట. ఇద్దరు బీసీ, ఒక ఓసీ మంత్రిని త‌ప్పించి..వారి స్థానంలో అదే..సామాజిక స‌మీక‌ర‌ణ‌లు క‌లిసి వ‌చ్చేలా..కొత్తవారికి చోటు కల్పిస్తారని అంటున్నారు. ఉమ్మడి క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్, మెద‌క్ జిల్లాల నుంచి..ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిని క్యాబినెట్‌లోకి తీసుకుంటారట.

నిజామాబాద్ నుంచి పీసీసీ చీఫ్ మ‌హేశ్‌ కుమార్ గౌడ్‌కు ఛాన్స్ దక్కొచ్చంటున్నారు. ఇక కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకుంటే..ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్ రెడ్డిని త‌ప్పించే అవ‌కాశం లేక‌పోలేదట. దీంతో త‌మ్ముడి కోసం అన్న మంత్రి ప‌ద‌వి త్యాగం చేయ‌డం త‌ప్పదా.? అన్న చ‌ర్చ మొదలైంది. త్వర‌లో జ‌రగ‌బోయే క్యాబినెట్ విస్తర‌ణ‌..ఇప్పటినుంచే కొంద‌రిలో గుబులు రేపుతుంటే..మ‌రికొంద‌రిలో మాత్రం ఆశ‌లు రేపుతోంది. అదృష్టం వ‌రించేదెవరికో.? ఉన్న పదవి ఊస్ట్ అయ్యేదెవరిదో వేచి చూడాలి మరి.