కల్వకుంట్ల కవిత న్యూ లుక్, న్యూ స్టైల్.. కట్టూబొట్టూ మార్చేసి.. ఖరీదైన వాచ్‌కు బదులు మట్టి గాజులు.. ఎందుకంటే?
తెలంగాణ పల్లెటూరి సంస్కృతిలో కొప్పుకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె కొప్పును ఎంచుకున్నారట.
K Kavitha
K Kavitha: సొంత రాజకీయ కుంపటి పెట్టుకునేందుకు రెడీ అవుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత..జనం బాట పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. ప్రతీ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటిస్తూ సామాన్య జనాన్ని కలిసి వారి కష్టాలు తెలుసుకుంటూనే అక్కడ మేధావులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు కవిత.
అయితే జిల్లాల బాటలో కవిత లుక్ సమ్ థింగ్ స్పెషల్‌గా ఉండటం ఆసక్తికరంగా మారింది. జాగృతి జనం బాటలో పాల్గొంటున్న కవిత తన స్టైల్‌ను పూర్తిగా మార్చేసి న్యూలుక్‌లో కనిపిస్తున్నారు. ఆమె ప్రస్తుత కట్టు, బొట్టు శైలి..ఇలా అన్నింటిలో స్పష్టమైన ఛేంజ్ కనిపిస్తోంది. గతంలో కవిత ఎక్కడికెళ్లినా దర్పం, హంగు, ఆర్భాటం కనిపించేవి. కానీ ఇప్పుడు ఇవేవి లేకపోగా సింప్లిసిటీకి ప్రయారిటీ ఇస్తున్నారట. (K Kavitha)
మొన్నటి వరకు ఖరీదైన చీరలు, చేతికి కాస్ట్‌లీ వాచ్, మ్యాచింగ్ కాస్మొటిక్స్..ఇలా అన్నింట్లోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకునేవారు కవిత. ఓ సందర్బంలో తాను ధరించే వాచ్ ధర ఇరవై ఐదు లక్షలు ఉంటుందని కూడా కవిత చెప్పడం చర్చకు దారితీస్తోంది. ఇక ఖరీదైన పట్టు చీరలు, స్టైలిష్ చెప్పులు, విదేశాల నుంచి తెప్పించుకున్న కాస్మోటిక్స్..ఇలా ప్రతీది ప్రత్యేకంగా కనిపించేంది. ఒక రోజులో రెండు మూడు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తే ఎప్పటికప్పుడు మేకోవర్ మార్చేసేవారు కవిత.
Also Read: తిరువూరు వార్‌ను అలా చల్లార్చేస్తున్నారా? చంద్రబాబు ప్లాన్ అదిరిపోయిందిగా..
అయితే ఇప్పుడు కవిత లుక్‌లో మార్పు వచ్చింది. ఆమె జడ వేసే స్టైల్ నుంచి చెప్పుల వరకు అన్నింట్లోనూ కొట్టొచ్చినప్పుడు మార్పు కనిపిస్తోంది. పట్టు చీరలు ధరించే కవిత ఇప్పుడు చేనేత చీరలు కట్టుకుంటోంది. చేనేత చీరలు కడుతూ చేనేత కార్మికులకు మద్దతుగా నిలుస్తున్నట్లు సందేశం పంపిస్తున్నారట. ఇంతకు ముందున్న హెయిర్ స్టైల్ ను పూర్తిగా మార్చి పాత కాలం స్టైల్లో కొప్పు పెట్టుకుంటున్నారు కవిత.
తెలంగాణలో కొప్పు ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని..
తెలంగాణ పల్లెటూరి సంస్కృతిలో కొప్పుకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె కొప్పును ఎంచుకున్నారట. ఇక ఇంతకు ముందులాగా ఖరీదైన వాచీలు ధరించడం లేదామె. కేవలం మట్టి గాజులను వేసుకుంటోంది. కవిత బొట్టు పెట్టుకునే విధానంలోనూ మార్పు కనిపిస్తోంది. తెలుగుదనంతో పాటు నార్త్ స్టైల్‌లో బొట్టు పెట్టుకుంటున్నారామె. ఇలా తన లుక్‌నే మార్చేశారు కవిత. సింప్లిసిటీలోకి వచ్చేశారు. అంతేకాదు ఆమె నడక, ప్రజలకు అభివాదం చేసే విధానం కూడా పూర్తిగా మారింది. అయితే ప్రజలకు దగ్గరయ్యే ఉద్దేశంతోనే ఆమె శైలిని మార్చినట్లు టాక్.
జాగృతి అధ్యక్షురాలు కవిత ఆహర్యంలో వచ్చిన మార్పు గురించి రాజకీయవర్గాలతో పాటు సామాన్య జనంలోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్న కవిత..అందుకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటున్నారని అంటున్నారు. అందుకోసం గతంలో పాలిటిక్స్‌లో సక్సెస్ అయిన మహిళా నాయకుల నడవడిక, వాళ్ల ఆహర్యాన్ని అనుసరించి కవిత ఇలా తన లుక్‌ను మార్చేశారట. కవిత లుక్ తమిళనాడులో పురచ్చి తలైవిగా గుర్తింపు పొందిన దివంగత ముఖ్యమంత్రి జయలలితను తలపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది.
అంతే కాకుండా సుష్మా స్వరాజ్, మమతా బెనర్జీ వంటి నేతలను గుర్తు చేస్తున్నారు. రాజకీయాలలో దృష్టిపరమైన గుర్తింపు ఎంత ముఖ్యమో జయలలిత నిరూపించారు. ఆమె ప్రత్యేకమైన వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్, ధైర్యంగా మాట్లాడే ధోరణి ఆమెను పొలిటికల్ ఐకాన్‌గా మార్చాయి. జాగృతి జనం బాట యాత్రలో కవిత కట్టుబొట్టు, పబ్లిక్ ఇంటరాక్షన్ స్టైల్‌ను గమనించినవారు..ఆమె జయలలిత ఆహార్యాన్ని రీక్రియేట్ చేస్తున్నారని భావిస్తున్నారు. కొత్త స్టైల్‌తో జనం గుండెల్లో బలమైన నాయకురాలిగా నిలిచిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళల్లో బలమైన సెంటిమెంట్‌ను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే కవిత కొత్త శైలిని ఎంచుకున్నారన్న టాక్ నడుస్తోంది.
