తిరువూరు వార్‌ను అలా చల్లార్చేస్తున్నారా? చంద్రబాబు ప్లాన్ అదిరిపోయిందిగా..
తీరు మారకపోతే పిలిచి మాట్లాడి..స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే తిరువూరు పంచాయితీని స్మూత్‌గా డీల్ చేస్తున్నారని అంటున్నారు.
Keshineni Chinni: థర్టీ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అక్కడ. ఇష్యూ ఏదైనా..ఎలాంటి సమస్య అయినా..ఎలా చెక్ పెట్టాలి..ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఆయనకు తెలిసినట్లుగా మరెవరికీ తెల్వదేమో. కూటమిగా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ ఉండనే ఉంటుంది. ఎమ్మెల్యే ఆదిమూలం ఎపిసోడ్ నుంచి..మంత్రి రాంప్రసాద్ సతీమణి సీఐకి వార్నింగ్ వరకు..లేటెస్ట్‌గా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..బాలకృష్ణ కామెంట్స్..ఇలా ప్రతీ అంశంలో ఎప్పటికప్పుడు సున్నితంగా వివాదాలకు చెక్ పెడుతూ వస్తున్నారు. ఇ
ప్పుడు తిరువూరు వార్‌ను సాఫ్ట్‌గా ల్యాండ్ చేసేలా సున్నితంగా డీల్ చేస్తున్నారు. తిరువూరులో ఎమ్మెల్యే కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య గొడవ జరిగిన వారం రోజులు దాటి పోయింది. అటు ఎమ్మెల్యే..ఇటు ఎంపీ డైలాగ్‌వార్‌పై పార్టీ ఇమీడియేట్‌గా రియాక్ట్ అయినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. చంద్రబాబు సీరియస్ అయ్యారు..ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిచి మాట్లాడేందుకు రెడీ అయ్యారంటూ లీకులు వచ్చాయి.
సీఎం చంద్రబాబు కూడా విదేశీ పర్యటనను నుంచి వచ్చాక చర్యలుంటాయన్న టాక్ వినిపించింది. అయితే చంద్రబాబు విదేశాల నుంచి వచ్చేవరకే అటు ఎంపీ..అటు ఎమ్మెల్యే ఇద్దరు సైలెంట్ అయిపోయారు. అటు ఎమ్మెల్యే సోషల్ మీడియా పోస్టులు..ఇటు ఎంపీ ప్రెస్‌మీట్‌తో ఒక్క రోజే రచ్చ చేశారు. ఆ నెక్స్ట్ మినిట్ అంతా గప్‌చుప్ అయిపోయారు. సోషల్ మీడియా పోస్టులు, ప్రెస్‌మీట్లు కాంట్రవర్సీ కామెంట్స్ లేకుండా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతలకు ఇండైరెక్టుగా వార్నింగ్స్ వెళ్లినట్లు..ఇప్పటికే అటు కేశినేని చిన్ని..ఇటు కొలికపూడి..చంద్రబాబుకు ఏమని సమాధానం చెప్పాలనేదానిపై డైలమాలో పడ్డట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read: “కాశీబుగ్గ” ఆలయంలో తొక్కిసలాటకు కారణాలేంటి? ఆ తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
కొన్నాళ్లుగా నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల గొడవలు పార్టీకి హెడెక్‌గా మారాయి. టీడీపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందన్న ప్రచారంపై అధినాయకత్వం మధన పడుతోంది. పార్టీలో కీలక నేతలు పదవుల్లో ఉన్నవారు ఒకరి మీద మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంపై సీరియస్‌గా ఉంది హైకమాండ్. లేటెస్ట్‌గా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదంపై పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు చంద్రబాబు.
ఇక మీదట ఎవరైనా కట్టు తప్పితే అసలు సహించేది లేదని హెచ్చరించారు. పార్టీనే సుప్రీం అని..ఎవరూ కూడా పార్టీ కంటే అతీతులు కారని స్పష్టం చేశారు. తాను చేయాల్సిన ప్రయత్నం చేస్తానన్న బాబు..అప్పటికి మార్పు లేకపోతే గట్టి చర్యలకు సిద్ధమని బాబు సీరియస్ వార్నింగే ఇచ్చేశారు. అయితే ఇప్పటికే అటు కొలికపూడి..ఇటు కేశినేని చిన్ని సైలెంట్ అయిపోయారు. టీడీపీ అధిష్టానం కోరుకున్నది కూడా ఇదే. ఇంటర్నల్‌గా ఎన్ని సమస్యలు ఉన్నా రచ్చకెక్కొద్దనే చెప్పుకుంటూ వస్తోంది పార్టీ హైకమాండ్. ఒకరి కామెంట్స్‌కు మరొకరు రియాక్ట్ అవడం అంతా అయిపోయింది. ఆ తర్వాత పార్టీ పెద్దలు సీరియస్‌గా ఉన్నారన్న వార్తలతో ఆ ఇద్దరు నేతల కామ్ అయిపోయారు.
ఇండైరెక్ట్ వార్నింగ్స్‌తోనే లైన్‌లోనే పెట్టే ప్రయత్నం
అయినా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి విజయవాడ ఎంపీ వివాదాన్ని పార్టీ క్రమశిక్షణా కమిటీకి బాబు అప్పగించారు. వారిద్దరితో కమిటీ మాట్లాడాలని అధినాయకత్వం ఆలోచనలు వారికి చెప్పాలని సూచించారు. ఇద్దరి అభిప్రాయలను తనకు ఒక లేఖ రూపంలో ఇవ్వాలన్న బాబు..లండన్ టూర్ నుంచి వచ్చిన తర్వాత ఆ ఇద్దరిని పిలిచి మాట్లాడుతానని చెప్పారట. వాళ్లిద్దరి పిలిచి మాట్లాడటం కంటే ముందే..ఇండైరెక్ట్ వార్నింగ్స్‌తోనే లైన్‌లోనే పెట్టే ప్రయత్నం చేస్తున్నారట చంద్రబాబు.
అయినా తీరు మారకపోతే పిలిచి మాట్లాడి..స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే తిరువూరు పంచాయితీని స్మూత్‌గా డీల్ చేస్తున్నారని అంటున్నారు. ఉన్నఫళంగా ఏ నేత మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ..చెప్పాల్సింది చెప్పి..తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. సేమ్‌టైమ్ పార్టీలో వరుస పరిణామాలు, నేతల టంగ్ స్లిప్‌పై కూడా అలర్ట్ అయిన చంద్రబాబు..ఇక నుంచి వారంలో ఒక రోజు పార్టీ కోసం కేటాయించేందుకు రెడీ అవుతున్నారట.
ఇదే విషయాన్ని లీడర్లకు చెప్పినట్లు తెలుస్తోంది. వీక్లీ వన్స్ డే మొత్తం పార్టీ కోసమే సమయం ఇస్తామని పార్టీని మరింత పటిష్టం చేయడానికి కోఆర్డినేట్ ఇంపార్టెంట్ అని చెప్పినట్లు తెలుస్తోంది. తాను ప్రతీ వారంలో ఒకరోజు మొత్తం టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉంటానని చెప్పారట బాబు. లోకేశ్ కూడా పార్టీ కోసం వారంలో ఒక రోజు టైమ్ ఇస్తారని కూడా చంద్రబాబు అన్నట్లు చెబుతున్నారు.
