10TV ground report Video: “కాశీబుగ్గ” ఆలయంలో తొక్కిసలాటకు కారణాలేంటి? ఆ తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
తొక్కిసలాట తర్వాత టెంపుల్ వద్ద కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి, భక్తుల వస్తువులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా కనపడ్డాయి.
Kasibugga temple
Kasibugga temple Stampede: శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. దీనిపై ఏపీ సర్కారు అధికారికంగా ప్రకటన చేసింది.
ఏకాదశి సందర్భంగా ఇవాళ ఆలయానికి 15,000 మంది వచ్చారని తెలిపింది. రెయిలింగ్ ఊడి పడి, తర్వాత తొక్కిసలాట జరిగిందని చెప్పింది. ఘటనాస్థలిలో ఏడుగురు, పలాసలోని ఆసుపత్రిలో ఇద్దరు మృతి చెందినట్లు వివరించింది. మరో 13 మందికి చికిత్స అందుతోందని చెప్పింది.
10టీవీ గ్రౌండ్ రిపోర్ట్
ఏకాదశి వేళ ఊహించినదాని కంటే చాలా ఎక్కువ మంది భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఊహించిన దాని కంటే అధికంగా భక్తులు రావడంతో పాటు సరైన భద్రతా చర్యలు లేకపోవడం కూడా ఇందుకు కారణమని భావిస్తున్నారు.
తొక్కిసలాట తర్వాత టెంపుల్ వద్ద కొబ్బరికాయలు, ఇతర పూజాసామగ్రి, భక్తుల వస్తువులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా కనపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే, అధికారులు అక్కడి పరిస్థితిని స్వయంగా పరివేక్షిస్తున్నారు.
ఆలయం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. దీంతో స్టెప్స్ ఎక్కే క్రమంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం 15,000 మంది భక్తులు వచ్చారు. అయితే, అందుకు తగ్గట్లు సెక్యూరిటీ సిబ్బంది గాని, క్రౌడ్‌ని కంట్రోల్ చేసే మేనేజ్మెంట్ వ్యవస్థ గాని పూర్తిగా లేకపోవడంతో ఒకరినొకరు తోసుకున్నారు.
ఆ సమయంలో కొంతమంది కింద పడిపోవడం, వారిని పైకి లేపే క్రమంలో మరికొంత మంది పడిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. కొంతమంది అప్పటికప్పుడు రైలింగ్ బద్దలుకొట్టి ఇక్కడి నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలోనూ కాశీబుగ్గలోని టెంపుల్ గురించి బాగా ప్రచారం జరిగింది.
పూర్తి వివరాలు..
