Revanth Reddy, KCR
Revanth Reddy: కృష్ణా జలాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై క్విక్‌గా రియాక్ట్ అయ్యారు సీఎ రేవంత్ రెడ్డి. వెంటనే చిట్ చాట్ పేరుతో అన్ని అంశాలపై మాట్లాడిన సీఎం రేవంత్..ఏకంగా కొడంగల్ వేదికగా గులాబీ బాస్‌కు బిగ్ సవాల్ చేశారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. నీళ్లా..నిధులా..నియమకాలా, సంక్షేమ పథకాలా..ఆప్షన్ మీదే..ఏ అంశామైనా చర్చించేందుకు రెడీ అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ముఖాముఖి తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ చేస్తున్నారు.
అయితే అన్ని అంశాల కంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ ప్రధాన అస్త్రంగా వాడుకునే అవకాశం ఉందట. అసెంబ్లీ వేదికగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చర్చకు పెట్టి..బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా కార్నర్ చేయాలనేది రేవంత్ వ్యూహమంటున్నారు. సేమ్‌టైమ్ కేసీఆర్ సభకు వస్తే..కృష్ణా జలాల ఎపిసోడ్‌కు కూడా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలనేది రేవంత్ స్కెచ్అట. సభలు పెట్టి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే కంటే ముందే అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తూ రేవంత్ కొత్త ఎత్తుగడ వేశారన్న చర్చ జరుగుతోంది.
Also Read: నేనూ హీరోయిన్‌నే.. మీది చేతగానితనం.. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే..: శివాజీపై అనసూయ మళ్లీ ఫైర్
కృష్ణాజలాల అంశంతో పొలిటికల్‌గా యాక్టీవ్ కావాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో సభలకు రెడీ అవుతున్నారు. ఈ మీటింగ్‌లకు తాను స్వయంగా హజరవుతానని..ఇక నుంచి ఐయామ్ ఆన్ ది ఫీల్ అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనం వల్లే తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా దక్కడం లేదన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అయితే ఇంతలోపే అసెంబ్లీ సమావేశాలు పెట్టి..కేసీఆర్ సభకు రమ్మని సవాల్ చేస్తున్నారు రేవంత్.
కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారా? లేదా?
అసలు తెలంగాణకు నీటి వివాదాలు రావడానికి కేసీఆరే కారణమంటున్న రేవంత్..పార్టీ ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడటం కాదు..దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది డౌటే. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి ఏ చర్చలో పాల్గొన్న సందర్భాలు లేవు. తెలంగాణ భవన్‌లో లేకపోతే ఫాంహౌస్‌లో నేతలను ఉద్దేశించి మాట్లాడటమో..ప్రెస్‌మీట్ పెట్టడమో తప్ప..అసెంబ్లీ వేదికగా అపోజిషన్ లీడర్‌గా ఏ అంశాన్ని ప్రస్తావించలేదు కేసీఆర్. ఇదే అస్త్రంగా మల్చుకుని కేసీఆర్‌ను సభకు రప్పించేందుకు మరోసారి గేమ్ స్టార్ట్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
ముఖ్యమంత్రి ముందు నుంచి పదే పదే ప్రస్తావిస్తున్న అంశం ఒకే ఒక్కటి. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని. ఎన్ని సార్లు సవాల్ చేసినా..రేవంత్ మాటలను కేసీఆర్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కేటీఆర్, హరీశ్‌తోనే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్రశ్నలకు సమాధానం చెప్పించారు కేసీఆర్. అయితే రేవంత్ మొత్తం కేసీఆర్ లేవనెత్తిన కృష్ణా జలాల అంశంలో ఆయన చేతనే చేత సమాధానం చెప్పించాలనే ఎత్తుగడ వేస్తున్నట్లు టాక్. అసెంబ్లీ వేదికగా రేవంత్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా చర్చ జరగాలనేది సీఎం స్కెచ్ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే టాపిక్ ఏదైనా చర్చకు రెడీ అంటూ రేవంత్ సవాల్ విసురుతున్నారని అంటున్నారు. అల్టిమేట్‌గా కేసీఆర్‌ను సభకు రప్పించాలన్నది రేవంత్ మైండ్ గేమ్ అన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ రేవంత్ సవాల్‌ను స్వీకరించి కేసీఆర్ సభకు వస్తే..ముందు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చర్చకు పెట్టే ప్లాన్ చేస్తున్నారట. కృష్ణావాటర్ విషయంలో కేసీఆర్ కేంద్రం దగ్గర ఒప్పుకున్న అంశాలను ఎక్స్‌పోజ్ చేస్తూ..తెలంగాణకు నీటి వాటాలు దక్కకుండా చేశారని వివరించాలని అనుకుంటున్నారట. మరి రేవంత్ సవాల్‌ను స్వీకరించి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేక ఎప్పటిలాగే లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.