Road Accident
Vijayawada Highway Accident: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ వద్ద నుంచి ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడితో బైకుపై వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది.
అతడి బైక్ ను డీసీఎం ఢీ కొట్టడంతో రెండు సంవత్సరాల కుమారుడు ముందే తండ్రి మృతి చెందాడు. దీంతో తండ్రి మృతదేహం పక్కనే ఏడుస్తూ ఆ బాబు కూర్చుండిపోయాడు. ఉదయాన్నే పాల ప్యాకెట్ కోసం కుమారుడితో తండ్రి బైక్‌పై వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.
బాబుకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఈ హృదయవిదారక ఘటనను చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: ఖమ్మం జిల్లా కారు ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్.. ”యాక్సిడెంట్ కాదు.. బావే చంపేశాడు”