ఖమ్మం జిల్లాలో కారు ప్రమాద ఘటనపై అనుమానాలు.. భర్తపై ఆరోపణలు, ఉరి తీయాలని డిమాండ్

అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే కుమారి, ఆమె పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదని.. పక్క ప్లాన్ ప్రకారమే ప్రవీణే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని వారు ఆరోపిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో కారు ప్రమాద ఘటనపై అనుమానాలు.. భర్తపై ఆరోపణలు, ఉరి తీయాలని డిమాండ్

భార్యాపిల్లలతో బోడా ప్రవీణ్ (ఫైల్ ఫొటో). ప్రమాదానికి గురైన కారు.

Khammam car accident case: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం హరియాతండాలో సమీపంలో జరిగిన కారు ప్రమాదం ఘటనలో ముగ్గురు చనిపోయిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి మంచుకొండ పంగిడి రోడ్డులో హరియాతండా దగ్గర చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు, మహిళ మృతి చెందారు. మృతులను బోడా కుమారి(26), కృషిక (5), క్రితన్య(2)గా గుర్తించారు. కారు నడిపిన కుమారి భర్త బోడా ప్రవీణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే ఈ ప్రమాదంపై కుమారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పక్క ప్లాన్ ప్రకారమే హత్య?
తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు బుధవారం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. భార్య, పిల్లల్ని ప్రవీణే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని వారు ఆరోపిస్తున్నారు. అతడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే కుమారి, ఆమె పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదని.. ఎటువంటి గాయాలు లేకుండా వీరు ముగ్గురు ఎలా చనిపోయారని ప్రశ్నించారు. వేరే మహిళతోని వివాహేతర సంబంధం పెట్టుకొని పక్క ప్లాన్ ప్రకారమే మా అక్కను, పిల్లల్ని మా బావనే చంపేశాడని కుమారి సోదరి ఆరోపించారు.

Also Read: ఛీ..ఛీ.. స్కానింగ్ సెంటర్‌లో ఆపరేటర్ వికృత చేష్టలు.. మహిళల ఫొటోలు, వీడియోలు తీసి..

ఆరోపణలు ఎదుర్కొంటున్న బోడా ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడుగా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు నడుస్తున్నట్టు కుమారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుమారితో పాటు పిల్లల్ని అడ్డుతొలగించుకునేందుకు పథకం ప్రకారం ప్రవీణ్ యాక్సిడెంట్ డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిజాలు వెలికితీసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

Also Read: కూతురి ప్రేమ వ్యవహారమే తండ్రి ప్రాణం తీసిందా..? బిల్డర్‌ మధు హత్య కేసులో సంచలన విషయాలు