నిర్లక్ష్యపు డ్రైవింగ్.. హైదరాబాద్‌లో మహిళను గుద్దిపడేసిన మినీ ట్రక్కు.. వీడియో వైరల్

Hyderabad Road Accident: ఈ ప్రమాద ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎక్స్ రోడ్ వద్ద ఓ మినీ ట్రక్కు అతివేగంతో దూసుకు వచ్చింది. ఆ వేగానికి ట్రక్కు అదుపుతప్పింది. ఓ పక్కకు వంగి ముందుకు దూసుకువెళ్లింది.

ఆ ప్రాంతంలో రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళను మినీ ట్రక్కు ఢీ కొడుతూ ముందుకు వెళ్లింది. దీంతో ఆ మహిళ రోడ్డుపైనే పడిపోయింది. కొంత దూరం వెళ్లాక ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

బాధితురాలి పేరు సూర్యకుమారి అని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కూకట్ పల్లిలో చోటుచేసుకున్న ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాహనదారులు, పాదచారులకు ప్రాణాపాయ ముప్పు కలిగేలా ట్రక్కును నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: పెళ్లి అనుకున్నావా? యుద్ధం అనుకున్నావా? వేదికపై వరుడు తుపాకీతో రచ్చ రంబోలా..