VIRAL VIDEO: పెళ్లి అనుకున్నావా? యుద్ధం అనుకున్నావా? వేదికపై వరుడు తుపాకీతో రచ్చ రంబోలా..
Groom Dancing With gun: పెళ్లి మండపంపై వరుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. పెళ్లికూతురి చేతిలో తుపాకీ పెట్టి..

తన పెళ్లి జరుగుతుందనుకున్నాడో, యుద్ధం జరుగుతుందని అనుకున్నాడో.. వేదికపై వరుడు తుపాకీతో రచ్చ రచ్చ చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వరుడు తన బంధువులతో కలిసి తుపాకీతో పెళ్లి మండంపై డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ సమయంలో వధువు చేతిలో తుపాకీ పెట్టి కాల్పించే ప్రయత్నం చేశాడు వరుడు. అయితే అది పేలలేదు. దీంతో వరుడు తుపాకీని తీసుకుని గాల్లోకి గురి పెట్టి కాల్చాడు. ఈ సారి అది పేలింది.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూ మండి కొత్వాలి ప్రాంతంలోని జనసత్ రోడ్‌లో ఉన్న ఓ బాంక్వెట్ హాల్‌లో వారం రోజుల క్రితం వివాహ వేడుక జరిగింది. ఈ సమయంలోనే వరుడు ఈ పనిచేశాడు.
ఈ కేసుపై సీవో రూపాలీరావు మాట్లాడుతూ.. మండి ప్రాంతంలో పెళ్లి సందర్భంగా వరుడు తుపాకీతో డ్యాన్స్ చేశాడని తెలిపారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
मुजफ्फरनगर शादी में पिस्टल पर डिस्को, दूल्हा दुल्हन ने की पिस्टल से फायरिंग, पिस्टल से फायरिंग का वीडियो वायरल, पुलिस कर रही वायरल वीडियो की जांच, नई मंडी थाने के जानसठ रोड़ का मामला.#MuzaffarNagar pic.twitter.com/zQgC3sRJTd
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) January 27, 2024