Road Accident : సిద్ధిపేట జిల్లాలో ఘోరప్రమాదం..

సిద్ధిపేట జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఆటోను ఢీకొంది. ప్రమాదం సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Accident (1)

Road Accident : సిద్ధిపేట జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఆటోను ఢీకొంది. ప్రమాదం సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరు మృతిచెందారు. బాధితులు ఆందోల్ మండలం సాయిబాన్‌పేట్‌కు చెందినవారు కాగా.. వీరు కొమురవెల్లి మల్లన్న దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

చదవండి : Car Accident Siddipet : సిధ్దిపేట జిల్లాలో విషాదం-బావిలో పడ్డ కారు

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలోకి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతురాలు నాగమణి (50)గా పోలీసులు గుర్తించారు. కారు సిద్దిపేట నుంచి హైద‌రాబాద్ వైపు వెళ్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గాయపడిన వారిలో ఒకరిపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం

చదవండి : Siddipet : సిద్దిపేట కలెక్టర్ రాజీనామా…టీఆర్ఎస్‌‌లో చేరుతున్నా