Car Accident Siddipet : సిధ్దిపేట జిల్లాలో విషాదం-బావిలో పడ్డ కారు
సిధ్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్నవ్యవసాయ బావిలో పడిపోయింది.

dubbaka car accident
Car Accident Siddipet : సిధ్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్నవ్యవసాయ బావిలో పడిపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. రామాయంపేట నుండి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కన చిట్టాపూర్ భూంపల్లి గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన ఉన్న బావిలో ఓ కారు అదుపు తప్పి పడిపోయింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో బావిలో ఉన్న నీరును తోడుతున్నారు. బావి లోతు సుమారు పదిహేను నుండి ఇరవై గజాలు ఉన్నట్టు స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు.
Also Read : Tirumala Ghat Roads Damage : యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మరమ్మత్తులు-టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
సమాచారం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నీటిని తోడే కార్య క్రమం మరింత వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బావిలో నుండి నీరు పూర్తిగా తోడేస్తే గాని ఆ కారులో ఎంత మంది ఉన్నారనేది తెలియని పరిస్థితి నెలకొంది.