Tirumala Ghat Roads Damage : యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మరమ్మత్తులు-టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరులమలలో  కొండచరియలు విరిగిపడి దెబ్బ తిన్న ఘాట్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

Tirumala Ghat Roads Damage : యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మరమ్మత్తులు-టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Ttd Chairman Inspects Ghat Road

Updated On : December 1, 2021 / 4:22 PM IST

Tirumala Ghat Roads Damage : తిరులమలలో  కొండచరియలు విరిగిపడి దెబ్బ తిన్న ఘాట్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బుధవారం ఉదయం దెబ్బ తిన్న ఘాట్ రోడ్లను   ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈరోజు సాయంత్రానికి ఢిల్లీ నుంచి
ఐఐటి నిపుణులు వస్తారని వారు ఇచ్చిన సూచన  మేరకు ఘాట్ రోడ్డులో పనులు మొదలు పెడతామని ఆయన తెలిపారు.

బుధవారం తెల్లవారుజామున 5-40 గంటల సమయంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. నాలుగు చోట్ల భారీ ప్రమాదం జరిగిందని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయవల్ల ఎవరూ గాయపడలేదని అధికారులు చైర్మన్‌కు వివరించారు. అనంతరం చైర్మన్ అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం వైవి సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ…గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ల లో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. ఉదయం 5 – 45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు.

Yv Subba Reddy Inspects Damaged Roads

Yv Subba Reddy Inspects Damaged Roads

వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చైర్మన్ చెప్పారు. ఢిల్లీ ఐ.ఐ.టి నుంచి నిపుణుల బృందం బుధవారం సాయంత్రానికి తిరుపతికి చేరుకుంటుందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయం పై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని ఆయన వివరించారు.
Also Read : Tirumala Ghat Road : కొండచరియలు విరిగి పడటంతో భారీగా దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు
ఆ తరువాత భవిష్యత్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతిస్తామని అన్నారు. ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వాహనాల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు భారీ వర్షాల దృష్యా తమ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఆరు నెలల్లోగా దర్శనం తేదీ మార్పు చేసుకునే అవకాశం ఉందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. నడకదారిలో తిరుమలకు వెళ్ళే భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.

జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి,చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి,ఈ ఈ శ్రీ సురేంద్ర రెడ్డి, డి ఎఫ్ ఓ శ్రీ శ్రీనివాసులు రెడ్డి ఇతర అధికారులు ఛైర్మన్ తో పాటు దెబ్బ తిన్నఘాట్ రోడ్లను పరిశీలించిన వారిలో ఉన్నారు.