Road accident in America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి

Road accident in America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహిళ మృతి చెందారు.

Road Accident in America

Road accident in America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో మిస్సోరిలో కారును వెనుక నుంచి వచ్చిన ట్రంక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందింది. మృతురాలు మహబూబాబాద్ జిల్లాకు మరిపెడ మండల కేంద్రానికి చెందిన వివాహిత దారం సుప్రియ (31)గా గుర్తించారు. సుప్రియ అమెరికాలోని మిస్సోరిలో ఉద్యోగ రిత్యా నివాసం ఉంటున్నారు. ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందగా.. భారత్‌కు చెందిన మరో యువతికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Also Read : Gold-Silver Prices Today : బంగారం ధరలకు బ్రేక్.. కారణాలివే..! ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?

మృతురాలు సుప్రియ భర్త కొడుమూరి రంజిత్, అత్తమామలు కొడుమూరి వెంకటేశ్వర్లు, రాధిక మహబూబాబాద్ పట్టణంలోని వీరభద్ర అపార్టుమెంట్స్ లో నివసిస్తున్నారు. సుప్రియ మృతివార్త తెలుసుకున్న వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉద్యోగరిత్యా అమెరికాలో ఉంటున్న సుప్రియ ఇలా అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.