Road Accident : ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ముందున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
- kunduru Vinod
- Published On : December 28, 2021 / 07:47 AM IST
Road Accident
Road Accident : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ముందున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్ర నగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
చదవండి : Road Accident : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి-అనాధలవటంతో అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే
ప్రమాదం సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 5గురు యువకులు, ఓ యువతి ఉన్నారు.
చదవండి : Road Accident: మద్యం మత్తులో డ్రైవింగ్.. ఇద్దరు యువతులు మృతి
యువతి కారు ముందు సీటులో ఇరుక్కుపోయింది. చాలా కష్టం మీద ఆమెను బయటకు తీశారు ఓఆర్ఆర్ సిబ్బంది. కారు నెంబర్ AP 13N 5121. ప్రయాణిస్తున్న వారిని డ్రైవర్ ప్రేమ్, కాశీనాథ్, గగన్, గోశాల్, అమిత్ కుమార్, వైశ్వవిగా గుర్తించారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
