Road Accident: మద్యం మత్తులో డ్రైవింగ్.. ఇద్దరు యువతులు మృతి

మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తి.. బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువతులు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని తాజ్ డ్రైవ్ ఇన్ హోటల్ల్ వద్ద హైదరాబాద్ -బీజాపూర్ హైవేపై

Road Accident: మద్యం మత్తులో డ్రైవింగ్.. ఇద్దరు యువతులు మృతి

Road Accident In Telangana

Updated On : December 27, 2021 / 10:08 AM IST

Road Accident: మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తి.. బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువతులు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని తాజ్ డ్రైవ్ ఇన్ హోటల్ల్ వద్ద హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కార్ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు మహిళలలో ప్రేమిక (16)అనే విద్యార్థి ఘటనాస్థలంలోనే మృతి చెందింది. క్షతగాత్రులైన సౌమ్య (20), అక్షయ (14)ల పరిస్థితి విషమంగా ఉండటంతో కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.

సౌమ్యా ట్రీట్మెంట్ తీసుకుంటూనే తుది శ్వాస విడిచిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరో యువతి అక్షయ పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు అంటున్నారు.

rEAD aLSO: 2021లో ఎక్కువగా అమ్ముడైన టాప్ కార్లు ఇవే!