Top Five Cars: 2021లో ఎక్కువగా అమ్ముడైన టాప్ కార్లు ఇవే!

గత కొన్నేళ్లలో భారతీయ మోటార్ ఫీల్డ్ ఎప్పుడూ ఎదుర్కోని సంక్షోభాన్ని కరోనా కారణంగా ఎదుర్కొంటోంది.

Top Five Cars: 2021లో ఎక్కువగా అమ్ముడైన టాప్ కార్లు ఇవే!

Wagon R

Top Five Cars: గత కొన్నేళ్లలో భారతీయ మోటార్ ఫీల్డ్ ఎప్పుడూ ఎదుర్కోని సంక్షోభాన్ని కరోనా కారణంగా ఎదుర్కొంటోంది. ఈ సమయంలో కూడా ప్రముఖ దేశీయ కార్ల కంపెనీ మారుతీ సుజికీ మాత్రం మెరుగైన గణాంకాలు చూపిస్తోంది. కొత్త సంవత్సరంలో మరో మూడు రోజుల్లో అడుగుపెట్టబోతున్నారు. ముగుస్తోన్న ఈ ఏడాది 2021లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అనేక రకాల కార్లు తయారయ్యాయి. ఎన్నో కంపెనీలు అప్‌డేటెడ్ మోడళ్లతో కార్లను అందుబాటులోకి తీసుకుని వచ్చాయి.

ఆటోమొబైల్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకీ.. దేశీయంగా అత్యధిక సంఖ్యలో కార్లను తయారు చేసిన కంపెనీగా ఈ ఏడాది కూడా నిలిచింది. ప్రతినెలా అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల జాబితాలో మారుతి సుజుకి టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ ఏడాది కూడా అత్యధిక కార్లు అమ్మిన కంపెనీగా మారుతి నిలవగా.. మారుతి సుజుకికి చెందిన వ్యాగనార్ కార్లే ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 1.74 లక్షల యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.

మారుతీ సుజికీ వ్యాగనార్ మోడల్ కారు బేసిక్ ధర 4.93 లక్షలు ఉండగా.. రెండో స్థానంలో ఆల్టో నిలిచింది. భారత్‌లో ఎక్కువమంది ఇష్టపడే కారు ఇదే కాగా.. ఈ కారు ఎక్స్‌షోరూమ్ బేసిక్ ప్రైస్ 3.15 లక్షలు. పెట్రోల్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వేరియంట్లల్లో లభిస్తుంది. ఈ సంవత్సరం ఆల్టో 1.62 లక్షల యూనిట్ల అమ్మింది మారుతి సుజుకీ. బడ్జెట్ ధరలో దొరకడం.. చిన్న కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలు కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు.

మారుతి సుజుకి నుంచి బాలెనో మూడో స్థానంలో ఉంది. ఈ లగ్జరీ కారు బేసిక్ ప్రైస్ 5.99 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూమ్). 1197 సీసీ ఇంజిన్, 88.5 బీహెచ్‌పీతో పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ సంవత్సరం 1.55 లక్షల యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. నాలుగో స్థానంలో స్విఫ్ట్, ఈకో ఐదో స్థానంలో ఉంది.