Roof Scum Blown Up At Hanumakonda Zp High School .. Injuries To Students
school ceiling Falls On the students : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండలోని ఓ స్కూల్లో పైకప్పు పెచ్చులు పడి కొంతమంది విద్యార్ధినిలకు గాయాలయ్యాయి. హన్మకొండ జిల్లాలోని హసన్‌పర్తి జడ్పీ హైస్కూల్‌లో స్కూల్ క్లాస్ రూమ్ లో పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థినిలకు గాయాలయ్యాయి. 10th class విద్యార్థులున్న గదిలోని పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఊడిపడటం వల్ల ఐదుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది.
స్కూల్లో జరిగిన ఈ ఘటనపై విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు పరుగులు తీశారు. గాయపడిన విద్యార్థినుల తల్లిదండ్రులు.. వారి పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. స్కూల్ పరిస్థితి ఇలా ఉంటే ఎప్పుడు ఏం జరుతుందోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.