Cannabis (1)
cannabis smuggled in train : హైదరాబాద్ లో గంజాయి కలకలం రేపింది. నాంపల్లి రైల్వే స్టేషన్ పోలీసులు 336 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి ముంబైకి రైలులో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్ లో రూ.3 కోట్లు ఉంటుందని అంచనా.
ఎవరికి అనుమానం రాకుండా ఏసీ బోగీల్లో గంజాయి తరలిస్తున్నారు. సూత్రధారి శెట్టి మహాదేవిని ఏ1గా పోలీసులు గుర్తించారు. మైనస్ సహా 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.