Telangana BSP : బీఎస్పీలోకి ప్రవీణ్ కుమార్!

ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో (BSP)లో చేరనున్నారని సమాచారం. వచ్చే నెల 08వ తేదీన నల్గొండలో ఎన్ జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త రాంజీ గౌతం సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి గురుకులాల మాజీ విద్యార్థులు (స్వేరోస్), మద్దతుదారులు, అభిమానులు హాజరుకానున్నారని తెలుస్తోంది.

RS Praveen Kumar BSP : వాలంటీర్ రిటైర్ మెంట్ తీసుకున్న ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలో చేరుతారు ? అనే చర్చ జోరుగా కొనసాగుతోంది. ఆయన రిటైర్ మెంట్ తీసుకున్న అనంతరం రాజకీయాల్లో వస్తారనే ప్రచారం జరిగింది. తొలుత అధికారిక పార్టీలో చేరుతారని పుకార్లు షికారు చేశాయి. బహుజన రాజ్యం కోసం తపన ఉండడంతో ఆయన బీఎస్పీలో చేరుతారని భావిస్తున్నారు. తాజాగా..ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో (BSP)లో చేరనున్నారని సమాచారం. వచ్చే నెల 08వ తేదీన నల్గొండలో ఎన్ జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త రాంజీ గౌతం సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి గురుకులాల మాజీ విద్యార్థులు (స్వేరోస్), మద్దతుదారులు, అభిమానులు హాజరుకానున్నారని తెలుస్తోంది.

Read More : Saudi Arabia : భారత్ తో సహా ఆ దేశాలకు వెళితే కఠిన చర్యలు : ప్రజల్ని హెచ్చరించిన సౌదీ సర్కార్

స్వచ్చంద విరమణ చేసిన అనంతరం ఆయన పలు జిల్లాల్లో పర్యటించారు. స్వేరోస్ ప్రతినిధులు, ఇతరులతో ఆయన సమావేశాలు జరిపారు. అందరి అభిప్రాయాల మేరకు ఆయన బీఎస్పీ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. తన నిర్ణయాన్ని అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నారు. పదవీ విరమణ తర్వాత కొత్త ప్రయాణం మొదలు పెడతానని ప్రవీణ్‌కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శేష జీవితాన్ని పీడిత ప్రజల సంక్షేమం కోసం కేటాయిస్తానని చెప్పారు.

Read More : Sai Dhanshika : సాగరతీరంలో సాయి ధన్సిక సొగసుల విందు..

తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణలో స్వేరోస్‌కు నాయకత్వం వహిస్తున్నారు ప్రవీణ్‌ కుమార్‌. గురుకులాలు ప్రస్తుతం సమర్థవంతమైన అధికారుల చేతిలో ఉన్నాయని, పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఎలాంటి బెంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. ఇక నుంచి జ్యోతిరావు పూలే, అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తానని, పేద, బడుగు బలహీన వర్గాల కోసం జీవిస్తానని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అనేక కీలక పదవుల్లో ఉంటూ…ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. గురుకులంలో అనేక సంస్కరణలు చేశారు. పిల్లలకు చదువుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు