TGSRTC Unions Strike Notice : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..! 45 రోజుల డెడ్ లైన్..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలైనా తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

TGSRTC Unions Strike Notice : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు.. ఇవాళ 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను ఆర్టీసీ యాజమాన్యానికి అందించాయి.

45 రోజుల్లోగా తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలైనా తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అటు, ఆర్టీసీ కార్మిక సంఘాల రాకతో పోలీసులు భారీగా మోహరించారు.

సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి సమ్మె సైరన్..
తెలంగాణ ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి సమ్మె సైరన్ మోగబోతోంది. 21 డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేయడం జరిగింది. 21 డిమాండ్లను సమ్మె నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతున్నా తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోయారు.

Also Read : గురుమూర్తి ఒళ్లు గగుర్పొడిచే పని.. భార్య మాధవి మృతదేహం కాలుతున్న సమయంలో..

డిపోలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ..
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు కార్మిక సంఘాల నేతలు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు వేతనాల పెండింగ్ బకాయిల సమస్యలను పరిష్కరించాలన్నారు. మొత్తం 21 డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల నేతలు నోటీసులు ఇచ్చారు.

తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాలకు గుర్తింపు లేదు. భవిష్యత్తులో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉండవంటూ చెప్పే ప్రయత్నం గతంలో జరిగింది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాయి. ఇప్పటికే ఆర్టీసీలో కార్మికులను గుర్తించాలంటూ కొన్ని యూనియన్లు లేబర్ కమిషన్ కు వెళ్లాయి. దానికి సంబంధించి హైకోర్టులో కొంత ఇష్యూ నడుస్తోంది.

21 డిమాండ్ల సమస్య పరిష్కారానికి కార్మిక సంఘాలు నోటీసులు..
తాజాగా సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో 21 డిమాండ్ల సమస్య పరిష్కారానికి కార్మిక సంఘాలు నోటీసులు జారీ చేయడంపై యాజమాన్యం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఏడీ మునిశేఖర్ కి ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల నాయకులు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది.

Also Read : గద్దర్‌కు ‘పద్మ అవార్డు’పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తోందని కార్మిక సంఘాల నేతలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. వీటితో పాటు గతంలో ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అప్పటి సర్కార్ కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన కార్యచరణ సిద్ధం చేయాలన్నది డిమాండ్. దీంతో పాటు 2021 పీఆర్సీ, 2017 పెండింగ్ వేతనాలు చెల్లించాలంటున్నారు. ఇక, ఆర్టీసీ కార్మికులు ఎవరైనా రిటైర్ అయితే అతడికి రావాల్సిన బకాయిలు రావడం లేదని.. వాటిని సత్వరమే రిలీజ్ చేయాలన్నది మరో ప్రధాన డిమాండ్.