Meerpet Madhavi Case : గురుమూర్తి ఒళ్లు గగుర్పొడిచే పని.. భార్య మాధవి మృతదేహం కాలుతున్న సమయంలో
కాలిపోయిన ఎముకలు అన్నింటిని కూడా ఇనుప రాడ్ తో పొడిగా తయారు చేశాడు. ఎముకల పొడి మొత్తాన్ని తీసుకెళ్లి చెరువులో చల్లేశాడు గురుమూర్తి.

Gurumurthy, Venkata Madhavi
Meerpet Madhavi Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రంగారెడ్డి జిల్లా మీర్ పేట హత్య కేసును పోలీసులు చేధించారు. భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. వెంకట మాధవిని గురుమూర్తి ఎలా చంపాడు అనేదానిపై నిర్ధారణకు వచ్చేశారు. సంక్రాంతి రోజు వెంకటమాధవిని కిరాతకంగా చంపేశాడు గురుమూర్తి. భార్యతో గొడవపడ్డ గురుమూర్తి ఆమెపై దాడి చేశాడు.
స్పృహ లేకుండా పడిపోయిన మాధవిని ఊపిరి ఆడకుండా చేసి హత్య..
గురుమూర్తి దాడిలో కిందపడిపోయిన మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్పృహ లేకుండా పడిపోయిన వెంకట మాధవిని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు గురుమూర్తి. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలని ఆలోచన చేశాడు. ఈ క్రమంలో మలయాళ క్రైమ్, థ్రిల్లర్ సూక్ష్మదర్శిని సినిమా తరహాలో డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలని నిర్ణయించాడు. వెంకట మాధవి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా చేశాడు గురుమూర్తి.
Also Read : మీరు నాకు తెలుసు.. మీకూ ఇలాంటి ఫోన్ కాల్ వచ్చిందా? టెంప్ట్ అయ్యి మాట్లాడారో ఖతమే..!
బకెట్ లో నీళ్లు పోసి హీటర్ పెట్టి శరీర భాగాలను ఉడకపెట్టాడు..
కాళ్ల భాగాన్ని కట్ చేసి బకెట్ లో వేశాడు. బకెట్ లో నీళ్లు పోసి హీటర్ పెట్టి భాగాలని ఉడకపెట్టాడు గురుమూర్తి. చేతులను కూడా కట్ చేసి బకెట్లో వేసి హీటర్ పెట్టి ఉడకపెట్టాడు. ఉడికిపోయిన శరీర భాగాల నుంచి వచ్చిన వాటర్ ని టాయిలెట్ లో పోసి ఫ్లష్ చేశాడు గురుమూర్తి. బాగా ఉడికిన తర్వాత శరీర భాగాలను బయటికి తీసి కాల్చేశాడు.
ఎముకలను పొడి చేసి చెరువులో చల్లేశాడు..
కాలిపోయిన ఎముకలు అన్నింటిని కూడా ఇనుప రాడ్ తో పొడిగా తయారు చేశాడు. ఎముకల పొడి మొత్తాన్ని తీసుకెళ్లి చెరువులో చల్లేశాడు గురుమూర్తి. కాగా, మృతదేహాన్ని కాల్చే సమయంలో గురుమూర్తి చేతులకు పలు గాయాలు అయినట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాక్షస కాండను కొనసాగించాడు గురుమూర్తి.
మృతదేహం కాలిపోతున్న సమయంలో వాసన బయటికి పోయేలా ఫ్యాన్లు..
మృతదేహం కాలిపోతున్న సమయంలో వాసనను బయటికి పంపించేందుకు ఫ్యాన్లు పెట్టాడు గురుమూర్తి. ఫ్లాట్ తలుపులు బహిరంగంగా తెరిచి ఫ్యాన్లు ఆన్ చేసి కాల్చివేశాడు గురుమూర్తి. భార్యపై అనుమానం వచ్చే విధంగా పోలీసులను తప్పుదోవ పట్టించాడు. భార్యకు వివాహేతర సంబంధం అంటగంటి పోలీసులను తప్పుదోవ పట్టించాడు గురుమూర్తి.