Rythu Bharosa 2nd Installment : రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రెండో విడత రైతు భరోసాకు ముహుర్తం ఫిక్స్.. ఆ రోజే అకౌంట్ లో డబ్బులు
Rythu Bharosa 2nd Installment : తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త.. బిగ్ అప్డేట్ వచ్చేసింది.
telangana rythu bharosa 2nd installment before 2026 april 15
- తెలంగాణ రైతులకు శుభవార్త
- రెండో విడత రైతు భరోసాపై అప్డేట్
- ఏప్రిల్ 15 నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు
Rythu Bharosa 2nd Installment: తెలంగాణలోని రైతన్నలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్ రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా.. ఎకరం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఎకరాకు రూ. 6,000 చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇక తాజాగా రేవంత్ సర్కార్ రెండో విడత రైతు భరోసాపై బిగ్ అప్డేట్ విడుదల చేసింది. ఏప్రిల్ 15 లోపు రెండో విడత రైతు భరోసా డబ్బులను అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో ఎకరం వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయగా.. రెండో విడతలో భాగంగా 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారని సమాచారం.
* రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ‘రైతు భరోసా’ కొత్త అప్లికేషన్లు ప్రారంభం.. వెంటనే ఇలా చేయండి
మార్చి 22న రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల చేసింది. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బటన్ నొక్కి తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 లక్షల మంది భూ యజమానుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6 వేల చొప్పున రూ. 3,590 కోట్లు జమ చేశారు. భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా.. ఎకరం భూమి కన్నా ఎక్కువ ఉన్నా.. తక్కువ ఉన్న వారందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేశారు.
*రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం.. రెండు లక్షల మందికి శుభవార్త
ఇక రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ. 6 వేల చొప్పున జమ చేయనుంది. అయితే తొలి విడతలో జమ చేసిన 6 వేల రూపాయలను మినహాయించి, మిగతా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా.. అర్హులైన రైతులందరికీ రెండో విడత రైతు భరోసా నిధులు జమ చేయడం కోసం దాదాపు రూ. 2,700 కోట్లను సమకూర్చుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత
ఏప్రిల్ నెలాఖరులోగా మూడో విడత నిధులు జమ చేయనున్నారు. దీంతో యాసంగి సీజన్ రైతు భరోసా కోసం మొత్తం రూ. 9,000 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.
