Constable Ramaiah Death : తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్.. కానిస్టేబుల్ రామయ్య మృతి

కానిస్టేబుల్ రామయ్య అనుమానాస్పద మృతి కింద 174 సెక్షన్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామయ్యతో పాటు వీధి నిర్వహణలో ఉన్న అధికారులను పోలీసులు విచారిస్తున్నారు.

SPF constable Ramaiah death

Saifabad Police Registered Case : హైదరాబాద్ లో విషాదం నెలకొంది. తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య మృతి చెందారు. కానిస్టేబుల్ రామయ్య మృతిపై కేసు నమోదు అయింది. కానిస్టేబుల్ రామయ్య మృతిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయినట్లుగా అధికారులు తెలిపారు. మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సుమారు 8.30 గంటలకు సంఘటన చోటు చేసుకుంది.

కానిస్టేబుల్ రామయ్య అనుమానాస్పద మృతి కింద 174 సెక్షన్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామయ్యతో పాటు వీధి నిర్వహణలో ఉన్న అధికారులను పోలీసులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని ఏసీపీ సంజయ్ పేర్కొన్నారు.

Agra : అమ్మ కోసం, తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 12 ఏళ్ల పిల్లాడు.. ఎంత దూరం నడిచాడంటే..

డ్యూటీ మార్చుకునే సమయంలో వెపన్ ను హ్యాండోవర్‌ చేసేటప్పుడు తుపాకి పేలిందని తెలిపారు. దీంతో కానిస్టేబుల్‌ రామయ్య ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్ళడంతో చనిపోయాడని వెల్లడించారు. ఎలాంటి అనుమానాలు లేవని, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని స్పష్టం చేశారు.

నాలుగున్నర సంవత్సరాలుగా రామయ్య సెక్యూరిటీగా ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ రామయ్య నాలుగు నెలలు క్రితం ఇన్సూరెన్స్ చేశారు. కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఉంది. కానిస్టేబుల్‌‌ రామయ్య నాలుగు నెలలు ప్రీమియం కట్టారు. ఇప్పటికే ఇన్సూరెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.