Agra : అమ్మ కోసం, తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 12 ఏళ్ల పిల్లాడు.. ఎంత దూరం నడిచాడంటే..
అమ్మ పడుతున్న బాధలు చూడలేని 12 ఏళ్ల పిల్లాడు పోలీసు స్టేషన్ కు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్లాడు. పోలీస్ అధికారిని తన బాధలు చెప్పుకున్నాడు.

12 years old Agra Boy Police Complainant
12 years Boy Police Complainant : అమ్మ కోసం ఓ పిల్లాడు చేసిన పనిని పోలీసులు అభినందించారు. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయటానికి ఓ 12 ఏళ్ల పిల్లాడు మూడు కిలోమీటర్లు చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్లి మరీ ఫిర్యాదు చేశాడు. మా నాన్న తాగి వచ్చి మా అమ్మను నానా హింసలు పెడుతున్నాడు. కట్టేసి ఇనుప గొలుసులతో కట్టేసి బెల్టుతో మా అమ్మాను దారుణంగా కొడుతున్నాడు మా నాన్నను అరెస్ట్ చేయండీ సార్ అంటూ వేడుకున్నాడు. ఆ పిల్లాడి ఆవేదన చూసి పోలీసులు కూడా చలించిపోయారు.
జెబ్రా గ్రామంలోని బాహ్ బ్లాక్‌లో హరిఓం అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అతను తాగుడుకు బానిస. ప్రతీరోజు తాగి వచ్చి భార్యను చిత్రహింసలు పెడతుంటాడు. భార్యను ఇనుప గొలుసులతో బంధించి బెల్టుతో కొడుతుంటాడు. అమ్మ పడుతున్న బాధలు చూడలేని 12 ఏళ్లపిల్లాడు వారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆగ్రా రూరల్ పోలీసు స్టేషన్ కు నడిచి వెళ్లాడు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. మంగళవారం (జూన్ ,2023)బసోని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి వీరేంద్ర కుమార్ కు తన అ్మమ పడే బాధలు చెప్పుకున్నాడు. మా నాన్న రోజు మద్యం తాగి వచ్చి మా అమ్మను దారుణంగా కొడుతున్నాడు సార్..మా అమ్మను కాపాడండి సార్ అంటూ గత వచ్చి వేడుకున్నాడు. ఆ వయస్సులోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆ బాలుడిని వీరేంద్ర అభినందించారు.
Chandrababu : అమ్మఒడిపై నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే కదా జగన్ రెడ్డీ : చంద్రబాబు కౌంటర్ ట్వీట్
ఆ తరువాత వీరేంద్ర తన పోలీసు టీమ్ తో హరిఓం ఇంటికి వెళ్లారు. హరిఓంను అరెస్టు చేశారు. కానీ తన భర్తను అరెస్ట్ చేయవద్దని ఆమె వేడుకుంది. దీంతో హరిఓంను పోలీసులు విడిచిపెట్టారు. మరోసారి భార్యపై చేయి చేసుకుంటే అరెస్ట్ చేస్తామని..ఆమె అడ్డువచ్చినా వినేది లేదని హెచ్చరించారు.దీంతో హరిఓం ఇక నుంచి నా భార్యను కొట్టను అని చెప్పాడు.
బాహ్‌లోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో హరిఓం కార్మికుడిగా పనిచేస్తున్నాడు. డ్యూటీ అయ్యాక రోజు మద్యం తాగి ఇంటికి రావటం భార్యను దారుణంగా కొడుతుంటాడు. దీంతో వారి కుమారుడు తండ్రిపై కోపం..తల్లిపై ప్రేమతో తండ్రిపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.అలా అమ్మ కోసం తండ్రిపైనే ఫిర్యాదు చేసిన బాలుడి ధైర్యాన్ని పోలీసులతోపాటు గ్రామస్థులు, అతని తాత దేశ్‌రాజ్ అభినందించారు.