Jai Mahabharat Party : పార్టీలో చేరితే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు..! జై మహాభారత్‌పై పోలీసులు సీరియస్

పార్టీలో సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటన చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసిన జై మహాభారత్ పార్టీ నిర్వాహకులపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇంటి స్థలం పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన సదరు పార్టీ వ్యవస్థాపకుడిపై చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు.

Jai Mahabharat Party : పార్టీలో సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెమ్ రూమ్ ఇల్లు ఇస్తామన్న ఆఫర్ తో మహిళలు క్యూ కట్టారు. హైదరాబాద్ రవీంద్రభారతి పక్కనే ఉన్న జై మహాభారత్ పార్టీకు భారీగా తరలివచ్చారు మహిళలు. రెండు పాస్ పోర్టు ఫొటోలు, ఆధార్ జిరాక్స్ కాపీతో వచ్చిన మహిళలు.. జై మహాభారత్ సభ్యత్వం మాకివ్వండి అంటూ ఆ పార్టీ ఆఫీస్ ముందు బారులు తీరారు. కాగా, దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. న్యూసెన్స్ అవుతోందని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటే 200 గజాల జాగాలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడంతో ఒక్కసారిగా ప్రజలు పోటెత్తారు. గడిచిన మూడు నెలల కాలంలో చూస్తే 5లక్షల వరకు పార్టీ మెంబర్ షిప్ నమోదైనట్లు సమాచారం. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తుందనే ఆశతో మహిళలు భారీగా తరలివచ్చారు. నగరంలోని మహిళలే కాదు.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు రవీంద్రభారతి పక్కనున్న జై మహాభారత్ ఆఫీసుకి వచ్చారు. ఒక్కసారిగా వందల మంది తరలిరావడంతో స్థానికంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కూడా కలిగింది.

పార్టీలో సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటన చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసిన జై మహాభారత్ పార్టీ నిర్వాహకులపై పోలీసులు సీరియస్ అయ్యారు. పార్టీలో సభ్యత్వం తీసుకుంటే ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన సదరు పార్టీపై చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు సైఫాబాద్ పోలీసులు.

Jai Bharat Party : జై మహాభారత పార్టీ పేరుతో అమాయక ప్రజలకు వల

పార్టీ వ్యవస్థాపకుడు అనంత విష్ణుదేవ ప్రభుపై కేసు నమోదుకు సిద్ధమయ్యారు. ఆధార్ కార్డుల సేకరణపై కేసు నమోదుకు న్యాయ సలహా తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే, దీనిపై తమకు ఎవరూ ఇంతవరకు ఫిర్యాదు చేయలేదని, అందుకే తాము చర్యలు తీసుకోలేదని ఎన్నికల అధికారులు అంటున్నారు. తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్లాట్లు ఇస్తామని జై మహాభారత్ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేశారు. ఒక్కొక్కరికి 200 గజాల స్థలం ఇస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు