Sankranti Rush : నగరం ఖాళీ అయిపోతోంది..సొంతూళ్లకు వెళుతున్న జనాలు

ద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో కుటుంబసభ్యులతో కలిసి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో జాతీయ రహదారులపై విపరీతమైన రద్దీ నెలకొంటోంది.

Sankranti Festival : నగరం ఖాళీ అయిపోతోంది. జనాలు పల్లెబాట పడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా..సొంత గ్రామాలకు వెళ్లేందుకు పయనమవుతున్నారు. విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో కుటుంబసభ్యులతో కలిసి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో జాతీయ రహదారులపై విపరీతమైన రద్దీ నెలకొంటోంది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలతో బిజీగా మారిపోయింది. టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరి నిలబడడం కనిపిస్తోంది. సాధారణ రోజుల కంటే…వాహనాల రాకపోకలు అధికం కావడంతో టోల్ ప్లాజాల వద్ద అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More : Anand Mahindra: ట్విట్టర్ యూజర్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే సమాధానం

టోల్ ట్యాక్స్ చెల్లింపు కేంద్రాలను సిబ్బంది పెంచారు. ఫాస్టాగ్ లో నగదు చెల్లింపు కారణంగా..కొంత రద్దీ నెలకొంటోంది. మరోవైపు..ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మొత్తం 4 వేల బస్సులను ఏర్పాటు చేసింది. అందులో 590 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం..ఇతర రాష్ట్రాల వైపుకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఈసారి చార్జీల విషయంలో ప్రయాణికులకు ఆర్టీసీ కాస్త ఊరట నిచ్చింది. పండుగకు తిప్పే స్పెషల్‌ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయించే అవకాశముంది. పండుగ కోసం ఊళ్లకు వెళ్లేవారిని తమ బస్సుల్లో ఎక్కించేలా ఆర్టీసీ ప్లాన్‌ చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు ఏర్పాట్లు చేశారు. మాస్క్ ఉంటేనే బస్సులోకి ఎంట్రీ ఉంటుందని వెల్లడిస్తున్నారు. పండుగ కు మరికొద్ది రోజుల సమయం ఉండడంతో నగరంలోని పలు బస్ స్టేషన్స్ లో రద్దీ కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు