×
Ad

Sankranti Special trains : సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు.. తేదీలు, సమయం ఇవే..

Sankranti Special trains : సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. ప్రత్యేక రైళ్లను నడపనుంది..

Sankranti Special trains

Sankranti Special trains : సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో నివాసముంటున్న ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్ మేరకు పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Also Read: Lionel Messi hyderabad Tour : హైదరాబాద్‌కు మెస్సి.. వాహనదారులు ఈ రూట్‌లో అస్సులు వెళ్లొద్దు.. అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

ప్రత్యేక రైళ్లు ఇవే..
♦ జనవరి 4, 11, 18 తేదీల్లో (ఆదివారం) సికింద్రాబాద్ – అనకాపల్లె (07041) వరకు. జనవరి 5, 12, 19 తేదీల్లో (సోమవారం) అనకాపల్లె- సికింద్రాబాద్ (07042)కు రైలును నడుపనున్నారు.
♦ జనవరి 9,16,23 తేదీల్లో (శుక్రవారం) హైదరాబాద్-గోరక్‌పూర్ (07075)కు, జనవరి 11, 18, 25 తేదీల్లో (ఆదివారం) గోరక్‌పూర్ – హైదరాబాద్ (07076) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
♦ ఈనెల 21న మచిలీపట్నం- అజ్మీర్ (07274)కు.. 28న అజ్మీర్-మచిలీపట్నం(07275) మధ్య ప్రత్యేక రైలును నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు వేళ్లలో మార్పు..
విశాఖపట్టణం నుంచి లింగంపల్లి మార్గంలో నడుస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805/12806) రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఇరువైపులా ఈ రైల్వే వేళల మార్పులు అమల్లోకి వస్తాయని తెలిపింది.
♦ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లింగంపల్లిలో ఫిబ్రవరి 15 నుంచి ప్రతిరోజూ ఉదయం 6.55 గంటలకు, బేగంపేట 7.20, సికింద్రాబాద్ 7.40, చర్లపల్లి నుంచి 8గంటలకు బయలుదేరుతుంది.
♦ తిరుగు ప్రయాణంలో విశాఖపట్టణం నుంచి ప్రతిరోజూ ఉదయం 6.20గంటలకు బయలుదేరి సాయంత్రం 6.05గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. సికింద్రాబాద్‌కు 6.30 గంటలకు, బేగంపేటకు 6.45గంటలకు, లింగంపల్లికి రాత్రి 7.15గంటలకు చేరుకోనుంది. ఆయా స్ట్రేషన్లలోనూ మార్పులు ఉంటాయని, ప్రయాణికులు మారిన వేళలను గమనించాలని ధక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.