Lionel Messi hyderabad Tour : హైదరాబాద్‌కు మెస్సి.. వాహనదారులు ఈ రూట్‌లో అస్సులు వెళ్లొద్దు.. అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

Lionel Messi hyderabad Tour : ఇవాళ సాయంత్రం హైదరాబాద్ మెస్సీ రానున్నారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Lionel Messi hyderabad Tour : హైదరాబాద్‌కు మెస్సి.. వాహనదారులు ఈ రూట్‌లో అస్సులు వెళ్లొద్దు.. అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

Lionel Messi hyderabad Tour

Updated On : December 13, 2025 / 8:23 AM IST

Lionel Messi hyderabad Tour : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత్ లో పర్యటించనున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడ్రోజులు మెస్సీ, ఆయన బృందం పర్యటన ఇండియాలో కొనసాగుతోంది. కోల్‌క‌తా, హైద‌రాబాద్‌, ముంబై, న్యూఢిల్లీ మ‌హా న‌గ‌రాల్లో మెస్సీ ప‌ర్య‌టిస్తారు. అయితే, ఇవాళ ఉదయం ఇండియాకు చేరుకున్న మెస్సీ.. మధ్యాహ్నం 2గంటల సమయంలో హైదరాబాద్ కు బయలుదేరుతారు.

Also Read: Lionel Messi : హైదరాబాద్‌కు మెస్సి.. ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తాడు.. ఏ సమయంలో ఎక్కడ ఉంటారు..? ఫుల్ షెడ్యూల్ ఇదే..

సాయంత్రం 4గంటల సమయంలో మెస్సీ, ఆయన టీం హైదరాబాద్ లో అడుగు పెట్టనుంది. రాత్రి 7గంటల సమయంలో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు పాల్గొంటారు. అయితే, మెస్సీ హైదరాబాద్ టూర్ సందర్భంగా నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా రూట్లలో వెళ్లే వాహనాలను వేరే ప్రాంతాలకు దారిమళ్లించేలా ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11.50గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఫలక్‌నుమా – ఉప్పల్ (సంతోష్ నగర్ మీదుగా), సికింద్రాబాద్ – ఉప్పల్ (హబ్సిగూడ మీదుగా) మార్గాల్లో వాహనాలను మళ్లించారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారుల ఆర్టీసీ బస్సులు లేదా మెట్రో రైలు వంటి ప్రజారవాణాను ఉపయోగించాలని రాచకొండ పోలీసులు సూచించారు.

నగరంలో భారీ వాహనాల డైవర్షన్స్..
♦ ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు డీఎండీఏ భాగ్యనాథ్ ఎంట్రెన్స్ వద్ద నాగోల్ – ఎల్‌బీ నగర్ వైపు మళ్లింపు.
♦ ఎల్‌బీ నగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో వద్ద యూ-టర్న్ తీసుకుని బోడుప్పల్ – చెంగిచర్ల – చర్లపల్లి వైపుగా వెళ్లాలి.
♦ తార్నాక నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు హబ్సిగూడ ఎక్స్‌రోడ్స్ వద్ద నాచారం – NFC – చర్లపల్లి రూట్ తీసుకోవాలి..
♦ రామంతాపూర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు స్ట్రీట్ నెంబర్ 8 వద్దే మళ్లింపు.
♦ వరంగల్ నుంచి హైదరాబాద్‌ రూట్‌లో వచ్చే వాహనాలు ఓఆర్ఆర్ – అబ్దుల్లాపూర్‌మెట్ – ఎల్‌బీ నగర్ రూట్‌లో వెళ్లాలి
♦ హైదరాబాద్ → వరంగల్ వయా ఉప్పల్ వచ్చే వాహనాలు ఎల్‌బీ నగర్ – హయత్‌నగర్ – ఓఆర్ఆర్ మార్గ వైపు వెళ్లాలి..

ఈవెంట్‌ కోసం వచ్చేవారికి పార్కింగ్ ఇక్కడే ..
♦ ఉప్పల్‌లో మెస్సీ పాల్గొనే ఈ వెంట్ కోసం మొత్తం 10 ప్రధాన పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు.
♦ వీటిలో తొమ్మిది మ్యాచ్ చూడటానికి వచ్చే వారికి కేటాయించారు. ఇవి స్టేడియం నుండి కిలో మీటరు పరిధిలో ఉన్నాయి.
♦ మరోవైపు.. వీవీఐపీలు, వీఐపీలు, అధీకృత పాస్ దారుల కోసం కేటాయించారు. స్టేడియం లోపలే వారికి పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
♦ వాలిడ్ పాస్ లేకుండా ఏక్ మినార్, ఎల్జీ గోడౌన్ చెక్ పోస్టులు దాటి అనుమతించరు.
♦ సాధారణ ప్రజల కోసం.. హబ్సిగూడ -ఉప్పల్ మార్గంలో పెంగ్విన్, టీజీఐఏఎల్ఏ, లిటిల్ ప్లవర్ జూనియర్ కాలేజెస్, మున్సిపల్ గ్రౌండ్ లో వాళ్లు తమ వాహనాలను పార్క్ చేసుకోవడానికి అనుమతిచ్చారు.
♦ రామంతాపూర్ – ఉప్పల్ మార్గంలో వచ్చేవారు జైన్ పార్కింగ్, శాండ్ అడ్డా, మోడరన్ బేకరీ, వాసు ఫార్మా వద్ద పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఈవెంట్ కోసం రాచకొండ పోలీసులు సెక్యూరిటీ, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, మౌంటెడ్ పోలీస్, వజ్ర, ఫైర్ ఫోర్స్ తదితర విభాగాల సహకారంతో 2,500 మంది సిబ్బందిని మోహరించారు. గేట్ నెం.1 కేవలం ప్లేయర్లు, వీవీఐపీలకు మాత్రమే. ప్రేక్షకులు తమ టికెట్లలో పేర్కొన్న గేట్ల ద్వారా మాత్రమే ప్రవేశం ఉంటుంది. స్టేడియం పరిసరాల్లో, చెక్‌పాయింట్ల వద్ద, పార్కింగ్ ప్రాంతాల్లో కలిపి 450 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తరువాత ఒక్కసారే ప్రవేశం ఉంటుంది. తరువాత ప్రింటెడ్ బార్ కోడ్ పాస్ జారీ చేస్తారు. పాస్ లు లేకుండా రావాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.