Lionel Messi : హైదరాబాద్‌కు మెస్సి.. ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తాడు.. ఏ సమయంలో ఎక్కడ ఉంటారు..? ఫుల్ షెడ్యూల్ ఇదే..

Lionel Messi India tour : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం, అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ ..

Lionel Messi : హైదరాబాద్‌కు మెస్సి.. ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తాడు.. ఏ సమయంలో ఎక్కడ ఉంటారు..? ఫుల్ షెడ్యూల్ ఇదే..

Lionel Messi

Updated On : December 13, 2025 / 7:31 AM IST

Lionel Messi  :ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం, అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత్‌లో అడుగు పెట్టారు. ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’ అన్న పేరుతో సాగనున్న ఈ పర్యటనలో భాగంగా మెస్సి మూడ్రోజులు ఇండియాలో ఉంటారు. శనివారం మొదలయ్యే మెస్సి ఇండియా పర్యటన సోమవారం సాయంత్రం ముగుస్తుంది. కోల్ కతా, హైదరాబాద్, ముంబయిలతోపాటు ఢిల్లీలో మెస్సీ టూర్ ఉంటుంది. ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో మెస్సి పాల్గోనున్నారు. మెస్సితో పాటు అతడి ఇంటర్‌ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్‌ సువారెజ్‌ ఉన్నారు. ఈ పర్యటనలో మెస్సి.. ముఖ్యమంత్రులు, కార్పొరేట్‌ దిగ్గజాలు, బాలీవుడ్‌ సెలెబ్రిటీలతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తాడు.

Also Read: హైదరాబాద్ కి మెస్సీ ఏంటి? ఇక్కడ ఫుట్ బాల్ ఏముంది? అనుకునే వాళ్లకి.. మన GOATS వీళ్లే.. ఒక్కసారి తెలుసుకోండి..

లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ షెడ్యూల్  ఇదే..
♦ డిసెంబర్ 13న ఉదయం మెస్సి, ఆయన బృందం కోల్‌కతాకు చేరుకుంటుంది.
♦ ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు మీట్ -అండ్ -గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
♦ ఉదయం 10.30 గంటల నుంచి 11.15 గంటల వరకు లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సి వర్చువల్‌గా ఆవిష్కరిస్తాడు.
♦ మధ్యాహ్నం 12గంటలకు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ, బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో కలిసి వివేకానంద యుబా భారతి క్రిరంగన్ (సాల్ట్ లేక్ స్టేడియం) వద్దకు చేరుకుంటారు.
♦ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు స్నేహపూర్వక మ్యాచ్, సత్కారం కార్యక్రమం ఉంటుంది.
♦ మధ్యాహ్నం 2గంటలకు మెస్సీ, ఆయన టీం హైదరాబాద్‌కు బయలుదేరుతుంది.
♦ ఇవాళ సాయంత్రం 4గంటలకు మెస్సీ హైదరాబాద్‌లో అడుగు పెడతారు.
♦ హైదరాబాద్ చేరుకున్నాక ఓ హోటల్లో విశ్రాంతి తీసుకుంటారు.
♦ సాయంత్రం 7గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు.
♦ స్టేడియంలో 15 నిమిషాలు రెండు టీములు పోటీ పడతాయి.
♦ మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ టీంతో కలుస్తారు.
♦ మ్యాచ్ తరువాత చివరగా స్కూల్ పిల్లలతో మెస్సీ ఇంటరాక్షన్ ఉంటుంది.
♦ తరువాత పరేడ్ ఉంటుంది. ఆ తరువాత మెస్సీకి సన్మానం ఉంటుంది.
♦ ఉప్పల్ స్టేడియంలో మొత్తం 1.40 నిమిషాలపాటు మెస్సీ గడుపుతారు.
♦ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టూర్ పూర్తయ్యాక హైదరాబాద్ నుంచి మెస్సీ వెళ్లిపోతారు.
♦ డిసెంబర్ 14వ తేదీన (ఆదివారం) మెస్సీ ముంబయిలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
♦ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో క్రికెట్‌ స్టార్లతో పికిల్‌బాల్‌ ఆడతాడు.
♦ సాయంత్రం 5గంటల సమయంలోవాంఖడే స్టేడియంలో జరిగే ఈవెంట్లో పాల్గొంటాడు.
♦ డిసెంబర్ 15వ తేదీన మెస్సీ పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది.
♦ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఢిల్లీలో అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగే ఈవెంట్‌కు హజరవుతాడు.
♦ అక్కడ కూడా చిన్నారులకు ఓ కోచింగ్ క్లినిక్‌ను నిర్వహించనున్నారు.
♦ సాయంత్రం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఆ తరువాత ఇండియా నుంచి మెస్సీ, ఆయన బృందం తిరుగు పయణం అవుతుంది.