Site icon 10TV Telugu

MPTC, ZPTC Elections : జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సన్నాహాలు..

ZPTC MPTC elections

ZPTC MPTC elections

MPTC, ZPTC Elections : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్.. బీఆర్ఎస్‌పై సెటైర్లు

సెప్టెంబరు 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితా.. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలని, సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించాలని సూచించింది. 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలని, 10వ తేదీన తుది ఓటర్ల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలాఉంటే.. సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, తాజాగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంపై మాట్లాడారు. సెప్టెంబర్ 10వ తేదీ తరువాత స్థానిక సంస్థల ఎన్నిక ఉంటుందని, సెప్టెంబర్ 30వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పారు.

Exit mobile version