Teacher Beats Students : మరీ అంత కోపమా? చెప్పులకు బురద అంటిందని విద్యార్థులను చితకబాదిన టీచర్

పిల్లలకు ఎంతో ఓర్పుగా పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విచక్షణ కోల్పోయింది. తెలిసీ తెలియని వయసు విద్యార్థులను సహనంగా చూసుకోవాల్సిన టీచరే రెచ్చిపోయింది. చిన్నపాటి తప్పుకే కర్ర తీసుకుని విరుచుకుపడింది. గొడ్డును బాదినట్లు బాదింది. అంతేకాదు వారి మనసులు సైతం గాయపరిచింది.

Teacher Beats Students : పిల్లలకు ఎంతో ఓర్పుగా పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విచక్షణ కోల్పోయింది. తెలిసీ తెలియని వయసు విద్యార్థులను సహనంగా చూసుకోవాల్సిన టీచరే రెచ్చిపోయింది. చిన్నపాటి తప్పుకే కర్ర తీసుకుని విరుచుకుపడింది. గొడ్డును బాదినట్లు బాదింది. అంతేకాదు వారి మనసులు సైతం గాయపరిచింది.

కరీంనగర్ జిల్లా మానకొండూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల టీచర్ రాజ్యలక్ష్మి తీరు వివాదానికి దారితీసింది. చెప్పులకు మట్టి అంటిందని ఆరుగురు విద్యార్థులను ఆమె చితకబాదింది. దీంతో విద్యార్థులకు గాయాలయ్యాయి.

మానకొండూరు గ్రామంలో ఇటీవల వర్షాలు కురిశాయి. దీంతో గ్రామమంతా బురదమయమైంది. బురదలోనే విద్యార్థులు స్కూల్ కి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయినా సరే ఇబ్బందులు పడుతూనే పిల్లలు స్కూల్ కి వెళ్లారు. అయితే, చెప్పులకున్న బురదను స్కూల్ ఆవరణలో దులిపేందుకు విద్యార్థులు ప్రయత్నించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇది చూసిన బయాలజీ టీచర్ రాజ్యలక్ష్మి కోపంతో ఊగిపోయింది. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ర తీసుకుని విద్యార్థులను చితకబాదింది. గొడ్డును బాదినట్లు బాదింది. దీంతో పిల్లలకు గాయాలయ్యాయి.

ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు చేరుకుని టీచర్ ను ప్రశ్నించారు. విద్యార్థులను అకారణంగా చితకబాదిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయుడిని డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు