కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్‌లో స్కూళ్లకు సెలవు

  • Publish Date - March 4, 2020 / 09:07 AM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. ఇండియాలోనూ వ్యాపిస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ 24ఏళ్ల హైదరాబాద్ టెకీకి సోకగా.. ఈ విషయం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే మైండ్ స్పేస్ లో పని చేస్తున్న పలువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఇంటి దగ్గర నుంచే పని చెయ్యాలని చెప్పగా… హైదరాబాద్‌లో ఈ విషయంపై ఆందోళనలు మొదలయ్యాయి. (హైదరాబాద్ లో కరోనా : శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరో కరోనా అనుమానితుడు )

ఈ క్రమంలోనే ఆ యువకుడు నివసించే మహింద్రా హిల్స్ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ సోకిన యువకుడి నివాస ప్రాంతమైన మహేంద్రహిల్స్‌లో ఇప్పటికే పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు ప్రకటన చేశారు.

మహింద్ర హిల్స్ లో కరోనా పాజిటివ్ వ్యెక్తి తిరిగినట్లు భావిస్తున్న అధికారులు.. మహేంద్రహిల్స్‌లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కరోనా సోకిన వ్యక్తి నివాసం చుట్టూ పారిశుద్ధ్య సిబ్బంది పిచికారీ చేశారు. స్కూళ్లకు వచ్చిన విద్యార్థులను సిబ్బంది వెనక్కి పంపుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేసిన వారిలో 36 మందికి నెగిటివ్ వచ్చింది. ఇంకా 48మంది రిపోర్టుల కోసం వెయిట్ చేస్తున్నారు.