Boora Narsaiah Goud: పంటి, కంటినొప్పులకు చికిత్స కోసం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు మరి?: బూర నర్సయ్య

రాష్ట్రంలో సర్పంచ్ నుంచి సీఎం వరకు ఎవరూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లడం లేదని అన్నారు.

Boora Narsaiah Goud

Boora Narsaiah Goud – BJP: తెలంగాణ (Telangana) ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. తెలంగాణలో వైద్య రంగం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఇక్కడ సర్కారు వైద్యం అంత అద్భుతంగా ఉంటే మరి పంటి, కంటినొప్పులకు చికిత్స కోసం సీఎం కేసీఆర్ (KCR) ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ఆయన నిలదీశారు.

రాష్ట్రంలో సర్పంచ్ నుంచి సీఎం వరకు ఎవరూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లడం లేదని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకు అంతగా పెరిగిపోతున్నాయని నిలదీశారు. 56 శాతం డెలివరీలు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయుస్మాన్ భారత్ ఎందుకు అమలు కావడం లేదని నిలదీశారు.

వరంగల్, నిమ్స్ ఆసుపత్రుల కోసం భూములను కుదువపెట్టారని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో రోగులను ఆసుపత్రులు చేర్చుకోవడం లేదని చెప్పారు. కాగా, గతంలో బీఆర్ఎస్ లో కొనసాగిన నర్సయ్య గౌడ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు.

KA Paul : పవన్ కల్యాణ్‌కు ప్రాణహాని ఉంది..! కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు