Congress: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు.. కాంగ్రెస్‌లోకి మరికొందరు నేతలు..

బీఆర్ఎస్‌కు 17 మంది ఆ పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. అలాగే, కీలక నేతలు

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితా రెడ్డి చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి.

బీఆర్ఎస్‌కు 17 మంది ఆ పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. వీరంతా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్‌ను వరుసగా కీలక నేతలు వీడుతుండడం ఆ పార్టీని టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే పట్నం సునితా రెడ్డి, బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత, బీఆర్ఎస్ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ శోభన్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

నేడు పార్టీని వీడిన వారు వీరే
ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుతో పాటు ఖందేష్ సంగీత శ్రీనివాస్, వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్, మేడిదాల సంగీత రవి గౌడ్, ఇట్టేడి నర్సారెడ్డి, బండారి ప్రసాద్, కొనపత్రి కవిత కాశీరాం, లిక్కి శంకర్, ఇంతియాజ్, ఆకుల రాము, వనం శేఖర్, సుంకరి ఈశ్వరి రంగన్న, ఆయేషా శిరిన్ (ఫయాజ్), పుత్లి బేగం (రహమాన్), నజేవీన్ సుల్తాన్ అతిక్, కొంతం మంజుల మురళి లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరందరికీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గడుగు గంగాధర్, నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ మాజీ చైర్మన్ యాల్ల సాయిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబాగౌడ్, మామిడిపల్లి మాజీ చైర్మన్ జ్యోతి మారుతి రెడ్డి, బాబా ఖాన్, గిరి, కోలా వెంకటేశ్, అజ్జు భాయ్, ఫయుమ్, మీర్స్ మాజీద్, సలీం, బాలకిషన్, మీసాల రవి, జిమ్మీ రవి, ఉపేందర్, రాజు భాయ్, శ్రీకాంత్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

Read Also: చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు : సీఎం జగన్

ట్రెండింగ్ వార్తలు