చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు : సీఎం జగన్

35ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా, మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేక పోయారని జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు : సీఎం జగన్

CM Jagan

CM Jagan Kuppam Meeting : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ నీవా సుజల స్రవంతి) నీరు విడుదల సందర్భంగా పూజా కార్యక్రమాలు చేశారు. హెచ్ఎన్ఎస్ఎస్ నీరు విడుదల చేశారు. అనంతరం గుండిశెట్టి పల్లి వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పంకు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని జగన్ అన్నారు. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన సందర్భం అని, నేను ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. లాభాలు ఉన్న పనులే చంద్రబాబు చేశారు.. నేను ఇది వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఇది చేశాను. మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టాము. కుప్పంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను 535 కోట్ల రూపాయలతో నిర్మిస్తాం. దీనివల్ల అదనంగా 5వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

Also Read : టీడీపీలో కొనసాగుతున్న టికెట్ల పంచాయితీ.. చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం

కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు..
35ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా, మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేక పోయారని జగన్ ప్రశ్నించారు. కుప్పంకే ప్రయోజనం లేని నాయకుడు వల్ల రాష్ట్రానికి ఏమి ప్రయోజనం జరుగుతుందని విమర్శించారు. తనకు భారీ వాటా ఇచ్చేవారికే ఈ ప్రాజెక్ట్ పనులు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేశాడని ఆరోపించిన జగన్.. ఎంతో చిత్తశుద్దితో ఈ పనులు మేము పూర్తిచేశామని చెప్పారు. తనకు లాభాలు తెచ్చి జేబులు నింపే పనులు చేసి మిగిలిన పనులు చంద్రబాబు వదిలేశాడని జగన్ విమర్శించారు. చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు అంటూ జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మించి కుప్పం వాసులకు నేను మేలు చేశానని అన్నారు. కుప్పంలో 87వేల కుటుంబాలు ఉండగా, ఇందులో 82వేల కుటుంబాలు మా పథకాలు అందాయని, ప్రతి ఒక్కరూ బ్యాంక్ లకు వెళ్లి స్టేట్ మెంట్ లు తీసుకోండి.. ఎంత డబ్బులు వచ్చాయో చూసుకోండి.. కుప్పంలో మరో 15వేల ఇళ్లకు పట్టాలు ఇవ్వనున్నామని జగన్ చెప్పారు.

Also Read : రమణ దీక్షితులపై వేటు.. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవే ..

బీసీ సీటును చంద్రబాబు కబ్జా చేశాడు..
మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లోనే చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయాడు. బీసీ సీటు కబ్జా చేసి చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబుకు చాలా ఇచ్చారు. మరి కుప్పం ప్రజలకు ఆయన ఏమిచ్చాడు అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. 70ఏళ్ల వయస్సులో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాడు. బీసీలు ఎక్కువ ఉన్న చోటకూడా వారికి టికెట్ ఇవ్వలేదు. తలుపులు బిగించుకొని పవన్ తో ప్యాకేజ్ గురించి మాట్లాడుతాడు. అసలు కాపులకు టీడీపీ చేసిందేంటి అని జగన్ ప్రశ్నించారు. బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ ను ఎమ్మెల్సీగా చేశాను. భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి.. క్యాబినెట్ లో చోటు ఇచ్చి ఆయనకు మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజి కారు ఇస్తామని మ్యానిఫెస్టోలో చంద్రబాబు చెబుతాడంటూ జగన్ ఎద్దేవా చేశారు.