×
Ad

Dundigal woman case : ఇంటి ఓనర్‌తో వివాహేతర సంబంధం.. కుమారుడి కళ్లెదుటే.. ఓనర్ అల్లుడు ఇంట్లోకి ప్రవేశించి.. దారుణ ఘటన..

Dundigal woman case : మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Dundigal woman case

Dundigal woman case : మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటి యజమానితో వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇంటి యాజమాని అల్లుడు పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నగరంలో నివసించే కిషన్ కు బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలో ఓ భవనం ఉంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వాతికి భర్తతో విబేధాలు తలెత్తడంతో విడిగా ఓ భవనంలో ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 3వ తరగతి చదువుతున్న పెద్ద కొడుకు వసతి గృహంలో ఉంటుండగా.. రెండో క్లాస్ చదువుతున్న చిన్న కుమారుడు స్వాతి వద్దనే ఉంటున్నాడు. అయితే, స్వాతికి ఆ ఇంటి యాజమానితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంకు దారితీసింది.

Also Read: Dhee Raju : చైతన్య మాస్టర్ సూసైడ్ ముందు లాస్ట్ కాల్ నాకే.. నేను ఏమైపోతానో అని అందరూ.. రాజు ఎమోషనల్..

ఇంటి ఓనర్ కు, స్వాతికి మధ్య బలమైన సంబంధం ఏర్పడంతో భవనంలోని ఇతర గదులకు అద్దెలనుకూడా స్వాతి వసూలు చేసేది. ఈ విషయం యాజమాని భార్య, కుటుంబ సభ్యులకు తెలియడంతో వారి మధ్య పలుసార్లు గొడవలు జరిగాయి. అయితే, శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి స్వాతి ఇంట్లోకి ప్రవేశించి.. ఆమె కొడుకు కళ్లముందే గొంతుకోసి హత్యచేశాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలిని పరిశీలించిన పోలీసుల.. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మృతిరాలి కుమారుడిని పోలీసులు ప్రశ్నించగా.. మా అమ్మను ఓ వ్యక్తి వెనుక నుంచి పట్టుకోగా.. మరొకరు కత్తితో గొంతు కోశారని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. కొద్ది గంటలకే స్వాతిని హత్య చేసింది నేనే అంటూ ఓ వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన మామతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే స్వాతిని హత్య చేసినట్టు పోలీసులకు నిందితుడు రాజేష్ చెప్పాడు.

తన కుటుంబంలో జరుగుతున్న గొడవలకు స్వాతి కారణమని, ఇంటి యజమానే తన అల్లుడు రాజేష్‌తో హత్య చేయించినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.