Telugu » Telangana » Seven Councilors Rebelled Against The Membership Of Ellareddy Municipality Chairman Kudumula Satyanarayana Kamareddy
Ellareddy Municipality : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ పై తిరుగుబాటు.. గోవా క్యాంప్ లో ఏడుగురు కౌన్సిలర్లు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. చైర్మన్ కుడుముల సత్యనారాయణ సభ్యత్వంపై ఏడుగురు కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. చైర్మన్ కు వ్యతిరేకంగా ఏడుగురు కౌన్సిలర్లు క్యాంప్ రాజకీయం మొదలు పెట్టారు.
Ellareddy Municipality : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. చైర్మన్ కుడుముల సత్యనారాయణ సభ్యత్వంపై ఏడుగురు కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. చైర్మన్ కు వ్యతిరేకంగా ఏడుగురు కౌన్సిలర్లు క్యాంప్ రాజకీయం మొదలు పెట్టారు. 12 మంది సభ్యుల్లో ఏడుగురు కౌన్సిలర్లు గోవా క్యాంప్ కు వెళ్లారు.ఇందులో ముగ్గురు కౌన్సిలర్లతోపాటు మరో నలుగురు కౌన్సిలర్ల భర్తలు ఉన్నారు.
చైర్మన్ సత్యనారాయణ ఒంటెత్తు పోకడలకు పోతున్నారని ఏడుగురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. నిధుల విషయంలో కూడా కౌన్సిలర్లతో చర్చించుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. గతంలో సత్యనారాయణను కౌన్సిలర్లు హెచ్చరించినప్పటికీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిధులను సొంత పనులకు వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
తమకు తెలియకుండా నిధులను వేరే పనులకు వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏడుగురు కౌన్సిలర్లు గోవా క్యాంప్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. సత్యనారాయణపై అవిశ్వాసానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎల్లారెడ్డి మండలంలో బీఆర్ఎస్ కు ముగ్గురు సర్పంచ్ లు రాజీనామా చేశారు. వీరు కాంగ్రెస్ లో చేరుతారని సమాచారం.