×
Ad

మేడారంలో కొనసాగుతున్న ట్రాఫిక్ కష్టాలు.. గంటల తరబడి ట్రాఫిక్‌లో భక్తులు

ట్రాఫిక్ నియంత్రణలో ఆధునిక టెక్నాలజీ, ఏఐ పరిజ్ఞానం సరైన ఫలితాలు ఇవ్వడం లేదు.

Medaram Jatara (Image Credit To Original Source)

  • మేడారం నుంచి పసరా చేరేందుకు 10 గంటలు  
  • పసరా నుంచి తాడ్వాయి చేరేందుకు 4 గంటలు
  • తాడ్వాయి నుంచి మేడారం చేరేందుకు మరో 4 గంటలు 

Medaram Jatara: ములుగు జిల్లా మేడారంలో ట్రాఫిక్ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. ట్రాఫిక్ నియంత్రణలో ఆధునిక టెక్నాలజీ, ఏఐ పరిజ్ఞానం సరైన ఫలితాలు ఇవ్వడం లేదు.

మేడారం చేరే మార్గాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడారం నుంచి పసరా చేరేందుకు 10 గంటల సమయం పడుతోంది. అలాగే, పసరా నుంచి తాడ్వాయి చేరేందుకు 4 గంటల సమయం, తాడ్వాయి నుంచి మేడారం చేరేందుకు మరో 4 గంటల సమయం పడుతోంది. ఇక మేడారం జాతరలో క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

Also Read: అమెరికా దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్‌ ఇలా చేసే ఛాన్స్‌: ట్రంప్‌

కాగా, మేడారం జాతర నేటితో ముగియనుంది. గద్దెలపై కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. జాతర తర్వాత తిరిగి సొంత ఊర్లకు వెళ్లే వారి సంఖ్య సైతం లక్షల్లోనే ఉండడంతో ఆ రూట్ బిజీగా మారింది.

పసరాలో ఇండియన్ పెట్రోల్ బంక్ నుంచి ఆర్చ్ వరకు ట్రాఫిక్ జామ్ భారీగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు.