Rajkumar Selfie Video : నా చావుకు ఆ నలుగురే కారణం.. షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో వైరల్..
Shabad Accused Rajkumar Selfie Video : అభంశుభం తెలియని కన్న కుమారులు, భార్య సహా ఆరు నిండు ప్రాణాలు బలిగొన్న షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ (29) ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలో పరుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అతని వద్ద పోలీసులు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోగా.. అందులో హత్యలకు ముందు సెల్ఫీ వీడియోను తీసుకున్నట్లు గుర్తించారు.
Shabad Accused Rajkumar Selfie Video
- నా చావుకు ఆ నలుగురే కారణం
- షాబాద్ నిందితుడు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో
- హత్యలకు ముందు వీడియోగా గుర్తించిన పోలీసులు
Shabad Accused Rajkumar Selfie Video : అభంశుభం తెలియని కన్న కుమారులు, భార్య సహా ఆరు నిండు ప్రాణాలు బలిగొన్న షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ (29) ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలో పరుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నించగా.. మృతదేహానికి దహనసంస్కారాలు నిర్వహించేందుకు వారు ముందుకు రాలేదు. దీంతో పోలీసులే దహన సంస్కారాలు నిర్వహించారు. ఇదిలాఉంటే.. రాజ్‌కుమార్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో అతను తీసుకున్న సెల్ఫీ వీడియోను గుర్తించారు. హత్యలకు పాల్పడేముందు ఈ వీడియోను తీసుకున్నట్లు తెలుస్తుండగా.. అందులో నా చావుకు కారణం ఆ నలుగురేనని నిందితుడు పేర్కొన్నాడు.
Also Read : Kavitha : సినీ పరిశ్రమ పెద్దలపై కవిత సంచలన కామెంట్స్.. నేను అధికారంలోకి వస్తే..
మారణకాండకు పాల్పడేందుకు ముందు రాజ్ కుమార్ సెల్ఫీవీడియో రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించిన సమయంలో అతని జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2:26 నిమిషాల నిడివి కలిగిన సెల్ఫీ వీడియో ఉన్నట్లు గుర్తించారు. హత్యలు జరిగిన రోజు సాయంత్రం 4.45 గంటలకు ఈ వీడియో రికార్డయింది. దాంతోపాటు నాలుగు పేజీల సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది.
సెల్ఫీ వీడియోలో, సూసైడ్ నోట్లో.. తాను మైనర్ బాలిక కుటుంబాన్ని నమ్మి పోసపోయానని, చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నానని రాజ్ కుమార్ పేర్కొన్నాడు. తనను, నా కుటుంబాన్ని ఆ అమ్మాయి అన్నివిధాలా వాడుకుని వదిలేసిందని తెలిపాడు. ఆ అమ్మాయే తనను ప్రేమిస్తున్నానంటూ వెంట పడిందని, తాను ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించిందని, దీంతో తాను అంగీకరించానని వివరించాడు. ఓ రోజు ఆ అమ్మాయి తనను కలవడం ఆమె నానమ్మ, తల్లి చూసి.. డబ్బులకోసం బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారని తెలిపాడు. వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చానని, వారికోసం రెండు ఎకరాల వరకు భూములు అమ్ముకున్నానని ఆ వీడియోలో రాజ్ కుమార్ వెల్లడించాడు. చివరికి తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేశారని పేర్కొన్నాడు.
రూ.50 లక్షలు ఇస్తావా? జైలుకు వెళతావా? అంటూ తనను బెదిరించారని.. వారి టార్చర్ భరిం చలేక గతంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించానని అన్నాడు. తాను ఆదుకున్న కుటుంబమే తనను జైలుకు పంపే ప్రయత్నం చేస్తుండడంతో జీవితంపై విరక్తి చెంది హత్యలకు పాల్పడుతున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. పరిస్థితి ఇంతదూరం రావడానికి బాలిక తల్లి, బాలిక నానమ్మతోపాటు మరో నలుగురు బంధువులు కారణమని పేర్కొన్నాడు. తాము చనిపోతే వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే, ఇందులో నా కుటుంబానికి ఎలాంటి పాత్ర లేదు. నాకు భూమి లేదు. మా నలుగుర్నీ అనాథల్లా శ్మశానవాటికలో కాల్చేయాలని తెలియజేస్తున్నా. నాకు ఎవరూ లేరు. నేను చేసుకున్న తప్పునకు నేనే శిక్షించుకోవాలని నిర్ణయం తీసుకున్నా. వాళ్లను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా అని ఆ వీడియోలో రాజ్ కుమార్ పేర్కొన్నాడు.
