నేను, నా భార్య మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణలు విన్నారు: షబ్బీర్ అలీ

Shabbir Ali: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్తుందని తెలిపారు.

ఫోన్ ట్యాప్ అవుతోందని ఏడాది ముందే రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని చెప్పారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని తెలిపారు.

తాను, తన భార్య మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణలు విన్నారని షబ్బీర్ అలీ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్తుందని తెలిపారు. తెలంగాణకు పదేళ్లుగా బీబీ పాటిల్ చేసిందేమీ లేదని అన్నారు. అభివృద్ధి ఏదీ జరగలేదని తెలిపారు.

రెండుసార్లు గెలిచిన బీబీ పాటిల్‌కు కనీసం మండలాల పేర్లు కూడా తెలియదని షబ్బీర్ అలీ విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని షబ్బీర్ అలీ కోరారు. 4 నెలల్లో 5 హామీలు పూర్తి చేశామని తెలిపారు. ఏడాది లోపు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోక్ సభ ఎన్నికల వేళ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నారు.

Telangana Congress : వారికి లైన్ క్లియర్..! పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్

ట్రెండింగ్ వార్తలు