Telangna New CS Shanthi kumari : తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతి కుమారి .. కాసేపట్లో ఉత్తర్వులు ఇవ్వనున్న ప్రభుత్వం

తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతి కుమారి నియమితులుకానున్నారు. ఆమె నియామానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో ఉత్వర్వులు ఇవ్వనుంది.

shanthi kumari to telangna cs

Telangna New CS Shanthi kumari : తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతి కుమారి నియమితులుకానున్నారు. ఆమె నియామానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మరికాసేపట్లో ఉత్వర్వులు ఇవ్వనుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ ఏపీకి తరలివెళ్లక తప్పనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన స్థానంలో తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా పలువురు పేర్లు వార్తల్లోకి వచ్చాయి. వారిలో అరవింద్ కుమార్,రామకృష్ణారావు పేర్లు వచ్చాయి. వారితో పాటు శాంతి కుమారి, వసుధా మిశ్రా,శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్ వంటిపేర్లు వచ్చాయి.కానీ ఎట్టకేలకు శాంతి కుమారి పేరు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. శాంతి కుమారి నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఇంతమంది పేర్లు ప్రధానంగా వినిపించినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం 1989 బ్యాచ్ కు చెందిన శాంతికుమారిని ఖరారు చేశారు. ప్రగతిభవన్ లో కొత్త సీఎస్ ఎవరిని నియమించాలి? అనేదానిపై సీఎం కేసీఆర్ కసరత్తులు చేశారు. అలా చివరికి శాంతి కుమారినే సీఎం కేసీఆర్ ఎంపిక చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీనియారిటీ ప్రకారంగా ఆమెకు సీఎస్ గా ఎంపిక చేయటం సరైనదిగా భావించిన కేసీఆర్ శాంతికుమారినే ఎంపిక చేసారు. దీంతో శాంతి కుమారి బుధవారం సాయంత్రం గానీ గురువారం గానీ బాద్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. మరోవైపు ఏపీకి వెళ్లనున్న మాజీ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ శాంతి కుమారిని బాధ్యతలు అప్పగించనున్నారు.

1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిగా ఉన్న శాంతికుమారి ఇప్పటికే పలు జిల్లాలకు కలెక్టర్ గా పని చేశారు. ప్రభుత్వంలో పొలిటికల్ సెక్రటరీగా పనిచేశారు.కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం అటవీశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న శాంతికుమారి తాజాగా తెలంగాణ చీఫ్ సెక్రటరీగా నియమితులు కానున్నారు. తనకున్న సీనియార్టీతో ఈ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారని తోటి ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. శాంతి కుమారి సీఎస్ గా నియమితులు కావటం పట్ల కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు హర్షం వ్యక్తంచేస్తున్నారని తెలుస్తోంది.

ఏపీకి సోమేశ్ కుమార్..తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతి కుమారి 
కాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ గురువారం (జనవరి 12,2023)ఉదయం ఏపీ విధుల్లో చేరాల్సి ఉంది. ఏపీ క్యాడర్ కు వెళ్లను తెలంగాణలోనే కొనసాగుతానంటూ సోమేశ్ కుమార్ కోర్టును కోరినప్పటికీ ధర్మాసనం మాత్రం ఏపీకి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో సోమేశ్ కుమార్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతప్తి వ్యక్తంచేశారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే యోచన కూడా చేశారు. ఈక్రమంలో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. సీఎం సీఎస్ చర్చల్లో ఏం జరిగిందో ఎటువంటి సలహాలు సోమేశ్ కుమార్ కు కేసీఆర్ ఇచ్చారో గానీ ఆ తరువాత ఇక ఏపీ క్యాడర్ కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంట్లో భాగంగా సోమేశ్ కుమార్ హైకోర్టు తీర్పు, డీవోపీటీ ఉత్తర్వుల మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని గురువారమే కలవాల్సి ఉంది. తన జాయినింగ్ రిపోర్టు ఇవ్వనున్నారు సోమేశ్ కుమార్. తెలుగు రాష్ట్రాల విభజన జరిగి ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సర్వీసులోనే కొనసాగిన సోమేశ్ కుమార్ వివిధ హోదాల్లో పనిచేసి సీఎస్ కూడా అయ్యారు.

సుప్రీంకోర్టుకు వెళ్లిన ఫలితంలేదని యోచించారో ఏమోగానీ సోమేశ్ కుమార్ పదవీకాలం 2023 చివరి వరకు ఉండడంతో సంవత్సర కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా ప్రస్తుత ఏపీ చీఫ్ సెక్రటరీ ఏ బాధ్యతలు అప్పజెప్పినా విధుల్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డీవోపీటీ విధించిన డెడ్‌లైన్‌కు అనుగుణంగా గురువారంలోగా అక్కడ జాయిన్ కావాల్సి ఉండగా గురువారం ఉదయమే ఏపీకి వెళ్ళి సీఎస్ జవహర్‌రెడ్డికి రిపోర్టు చేయనున్నారు సోమేశ్ కుమార్. సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సి రావటంతో ఇక తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి బాధ్యతలు తీసుకోనున్నారు. శాంతి కుమారి నియమకానికి సంబంధించి మరి కాసేపట్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.