Ys Sharmila
YS Sharmila : తెలంగాణలో పోడుభూముల సమస్యపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరు చేయనున్నారు. తెలంగాణలో పోడుభూముల సమస్య అధికంగా ఉన్న ములుగు జిల్లాలో ఈ నెల 18న ఆమె పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పోడు భూములకై పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఉదయం 11 గంటలకు ములుగులో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం పస్రాలోని కుమురం భీం విగ్రహానికి నివాళి అర్పించి, లింగాల వరకు భారీ ర్యాలీ చేపట్టి పోడుభూములకై పోరు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగి వెళ్లనున్నారు.
ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న సోమ్లాతండా తండా యువకుడు సునీల్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ రాజగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, షర్మిల మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగిలో నిరుద్యోగ దీక్ష చేపట్టన్నారు. ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న సో మ్లాతండావాసి బోడ సునీల్ నాయక్ కుటుంబ సభ్యులను ముందుగా పరామర్శిస్తారు.