Siddipet Collector Venkatram Reddy Resign
Siddipet Collector : సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా ? ఆయన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం ఆయన బీఆర్కే భవన్ కు వచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సీఎస్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం కలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
Read More : SSMB 28: త్రివిక్రమ్ కొత్త కాంబినేషన్.. మహేష్‌తో అందాల రాక్షసి!
26 సంవత్సారాల పాటు అన్ని ప్రభుత్వాల్లో పని చేశానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తోందని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరాలని ఆదేశాలు ఇంకా రాలేదని, ఆదేశాలు వచ్చాక ఆ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పనిచేస్తానని చెప్పారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందని సమాచారం.
Read More : Siddipet : సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా ?
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫీవర్ తగ్గిపోయిన క్రమంలో..ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. స్థానిక సంస్థల నుంచి 12, ఎమ్మెల్యే కోటాలో 6, గవర్నర్ కోటాలో ఒకరికి మొత్తం 19 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ కావాల్సి ఉంది. సంఖ్యా బలంగా చూస్తే..టీఆర్ఎస్ కే అధిక అవకాశం ఉంది. దీంతో..అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తులు జరుపుతున్నారని సమాచారం. అనూహ్యంగా..ఎమ్మెల్సీ అభ్యర్థుల రేసులోకి సిద్ధిపేట కలెక్టర్ పేరు రావడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.