Harish Rao : సిద్ధిపేట కోనసీమను తలపిస్తోంది, కారణం కేసీఆరే- హరీశ్ రావు ప్రశంసల వర్షం

రాష్ట్రం రైతు నాయకుని చేతుల్లో ఉంది. కాబట్టే రైతు రాజ్యం వచ్చింది. భూముల విలువ ఆకాశాన్ని అంటింది. రైతుల విలువ పెరిగింది. Harish Rao

Harish Rao Praises CM KCR

Harish Rao Praises CM KCR : ఒక నాడు గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు ఉన్న చోట.. నేడు ఏటా మూడు పంటలు పండుతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. పచ్చని పొలాలతో సిద్ధిపేట కోనసీమను తలపిస్తోందన్నారు. దీనికి కారణం సీఎం కేసీఆరే అని చెప్పారాయన. సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కేసీఆర్ కారణ జన్ముడని హరీశ్ రావు ప్రశంసించారు. కొంతమంది కలలు కంటారు, వాటిని నిజం చేసుకునే వారు కొద్దిమందే ఉంటారని చెప్పారు.

హరీశ్ రావు కామెంట్స్..
‘సిద్దిపేటను జిల్లా చేశారు. రైలు మార్గాన్ని తెచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రైలు మార్గాన్ని మూలన పడేస్తే.. నేడు నిజం చేసుకున్నాం. కాళేశ్వరం రూపకర్త కేసీఆర్. కాళేశ్వరం నీళ్ళు వస్తాయంటే మేం చూస్తామా అని ప్రతి పక్షాలు ఎకసెక్కలు ఆడాయి. మూడేళ్లలో పూర్తి చేసి చరిత్ర తిరగరాశారు కేసీఆర్. ఒకనాడు గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు ఉన్న చోట.. ఏటా మూడు పంటలు పండుతున్నాయి. పచ్చని పొలాలతో కోనసీమను తలపిస్తోంది.

Also Read : కవితకు ఆ ఇద్దరి బాధ్యతలే ఎందుకు అప్పగించారు.. ఆ ఇద్దరు నేతలు ఎవరు?

కేసీఆర్ రైతును బలోపేతం చేస్తే.. రైతుల చేతుల్లోని భూముల విలువ ఆకాశాన్ని అంటింది. రైతుల విలువ పెరిగింది. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా ఎన్నడూ వ్యవసాయాన్ని వదలలేదు. రాష్ట్రం రైతు నాయకుని చేతుల్లో ఉంది. కాబట్టే రైతు రాజ్యం వచ్చింది. ఒక్కసారి ఛాన్స్ అంటున్న వాళ్ళు 11సార్లు పాలించినా తాగునీరు ఇవ్వలేదు. సిద్దిపేట డిక్షనరీలో కరవన్నదే లేకుండా చేసిన మన బిడ్డ కేసీఆర్’.

సీఎం కేసీఆర్ కామెంట్స్..
జన్మభూమిని మించిన స్వర్గం లేదు. సిద్ధిపేట గడ్డ జన్మనిచ్చింది, సాకింది, భాష నేర్పింది, ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది. ప్రతి సందర్భంలో నన్ను విజేతగా నిలిపింది ఈ గడ్డ. మిషన్ భగీరథకు సిద్దిపేట మంచి నీళ్ల పథకమే పునాది. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి కూడా ఇక్కడే పునాది.

Also Read : కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

సిద్దిపేటకు రానిదెంది. లేనిదెంది. గోదావరి జలాలు వచ్చాయి.. రైలు వచ్చింది.. సిద్దిపేట ఒక్కటే తక్కువ.. గాలి మోటార్ తప్ప. దలితబంధుకు కూడా ఇక్కడి రామంచ పునాది. దిక్కుమాలిన కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధికి కృషి చేయలేదు. ప్రతి కుటుంబానికి దలితబంధు అందే దాకా ఆపేదే లేదు. బీసీబంధు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణకే తలమానికంగా సిద్దిపేట నిలిచింది’.