సలేశ్వరం జాతర విశిష్టత ఏంటి? ఎలా వెళ్లాలి? అక్కడ ఏమేం నిషిద్ధం.. ఫుల్ డీటెయిల్స్

అక్కడి లోయలోని గుహలో స్వామి వారి విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటారు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ మండలం సలేశ్వరం లింగమయ్య స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారి భక్తులతో రద్దీగా ఉంది. ప్రతి ఏడాది చైత్రపౌర్ణమి వేళ 3 రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు.

ఈ జాతరకు అనేక విశిష్టతలు ఉన్నాయి. బయటి వాళ్లు ఇక్కడ షాపులు పెట్టకూడదు. జాతర తప్ప ఇతర రోజుల్లో ప్రవేశం లేదు. జంతువులను హాని కలిగించకూడదు. భక్తులు మొదట ఫర్హాబాద్‌ గేటు వద్దకు చేరుకుంటారు. అనంతరం వస్తున్నాం లింగమయ్యా అంటూ నినాదాలతో లోయలు, సెలయేర్లు దాటుతూ వెళ్తారు. ప్రతిరోజు వేలా మంది స్వామివారిని దర్శనం చేసుకుంటారు.

సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర ఏడాదికి ఒకసారి 3-5 రోజుల ఉంటుంది. మిగతా ఏడాది అంతా ఈ ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఈ ఆలయం నల్లమల అడవుల్లో ఉంటుంది. ఇది శ్రీశైలానికి దాదాపు 60 కి.మీ దూరంలో ఉంటుంది.

Also Read: అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి.. చంద్రబాబు, జగన్ దిగ్భ్రాంతి

అక్కడ కాలినడకన వెళ్లాల్సిందే..
భక్తులు ఆలయానికి అక్కడికి చేరుకోవాలంటే కొండలు దాటాలి. వారు దాదాపు ఐదు కి.మీ నడవాల్సి ఉంటుంది. అక్కడి వాహనాలు వెళ్లలేవు. దీన్ని తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర అని అంటుంటారు. సలేశ్వరం లింగమయ్య స్వామి జాతరలో చెంచు గిరిజనులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూజా సామగ్రిని వారే అమ్ముతుంటారు.

తూర్పు గుట్ట మీద అర కిలోమీటరు నడిచి అనంతరం దక్షిణం వైపుకి ముందుకు వెళ్లాలి. ఆ తర్వాత పశ్చిమం వైపు గుట్టపైన ఒక కి.మీ. నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉత్తరం వైపునకు తిరగాలి. గుట్టల మధ్య ఉన్న లోయలోకి దిగాలి.

అక్కడి లోయలోని గుహలో స్వామి వారి విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ మందిరం 7 శతాబ్దాల క్రితం నాటిదని తెలుస్తోంది. పురాణాల్లోనూ దీని ప్రస్తావన ఉంది. ఆ ఆలయం పక్కన ఓ జలపాతం కూడా ఉంటుంది. ఆ నీటి లింగాన్ని తాకుతూ వెళ్తుంది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు.