×
Ad

Singareni: సింగరేణి కార్మిక కుటుంబాలకు గుడ్‌న్యూస్‌.. 12న నియామక పత్రాలు..

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసే అవకాశం ఉంది.

Singareni: సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ పూర్తి చేసి ఇప్పటివరకు నియామక పత్రాలు పొందని 473 మంది కారుణ్య ఆభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. నవంబరు 12న కొత్తగూడెంలో వారికి నియామక పత్రాలను అందనున్నాయి.

ఐఎన్​టీయూసీ జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్ కృషి ఫలితంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసే అవకాశం ఉంది. (Singareni)

RTC: ఆర్టీసీ ప్రయాణికులకు ఇన్సురెన్స్‌ సదుపాయం కల్పించే యోచనలో ప్రభుత్వం?

పలు కారణాల వల్ల ఎన్నో నెలలుగా ఈ నియామక పత్రాల జారీ పెండింగ్‌లో ఉంది. యాజమాన్యం, ప్రభుత్వంపై కార్మిక సంఘాల నేతలు ఒత్తిడి తీసుకువచ్చారు. ఇక సింగరేణిలో 473 మంది కార్మిక కుటుంబాలకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది.