RTC: ఆర్టీసీ ప్రయాణికులకు ఇన్సురెన్స్‌ సదుపాయం కల్పించే యోచనలో ప్రభుత్వం?

ప్రయాణికులకు దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే వారి మీద ఆధారపడిన కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతాయి.

RTC: ఆర్టీసీ ప్రయాణికులకు ఇన్సురెన్స్‌ సదుపాయం కల్పించే యోచనలో ప్రభుత్వం?

Updated On : November 7, 2025 / 12:15 PM IST

RTC: ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని చాలా మంది వీటినే నమ్ముకుంటారు. ఇటీవల బస్సు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే చేవెళ్లలోని మీర్జాగూడలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. కానీ, ఆర్టీసీ ప్రయాణికులకు ఇన్సురెన్స్‌ సదుపాయం ఉండదు. అయితే, ప్రయాణికులకు ఇన్సురెన్స్ సదుపాయం అందించాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. టికెట్‌లో రూ.1 సేఫ్టీ సెస్ చెల్లిస్తున్నప్పటికీ అది బీమా కాదు. (RTC)

Also Read: 10టీవీ ఎఫెక్ట్‌.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, రౌడీషీటర్ సూరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు

ప్రయాణికులకు దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే వారి మీద ఆధారపడిన కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతాయి. మోటార్ వెహికల్ యాక్ట్-1988 కింద ప్రైవేట్, ట్రావెల్స్ బస్సుల ప్రయాణికులకు బీమా తప్పనిసరి. ఆర్టీసీ వ్యవస్థలకు మాత్రం అందులో మినహాయింపు ఉంది. 10,000కు పైగా ఉండే బస్సులకు ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు ప్రీమియం కట్టడం ఆర్టీసీకి కష్టమే.

ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధులు పలుసార్లు చెప్పారు. ఆర్టీసీ టికెట్‌కు ఇన్సురెన్స్‌ యాడ్ చేయాలని గతంలో భావించారు. ఇందుకు టికెట్ ధరలో రూ.2-రూ.5 తీసుకోవాలని అనుకున్నారు. అయితే, పలు కారణాలతో ఇది అమలు కాలేదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ప్రయాణికులకు ఇన్సురెన్స్‌ సదుపాయం కలిగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.