Theaters Parking Fee : సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులపై కొత్త జీవో

సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజుల వ‌సూలుపై తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త జీవో 63ను జారీ చేసింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల ఆవరణలో నిలిపే వాహనాలకు పార్కింగ్‌ ఫీజు వసూలు చేయనుంది.

Theaters Parking Fee : సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజుల వ‌సూలుపై తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త జీవో 63ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల ఆవరణలో నిలిపే వాహనాలకు పార్కింగ్‌ ఫీజు వసూలు చేసుకోవచ్చునని వెల్లడించింది. కమర్షియల్ మల్టీప్లెక్స్‌ల్ థియేటర్లలో మాత్రం యథాతథంగా ఉచిత పార్కింగ్‌ కొనసాగుతుందని పేర్కొంది. కొవిడ్ త‌ర్వాత సినిమా థియేట‌ర్ల‌కు వచ్చే ప్రేక్షకుల రాక బాగా తగ్గిపోయిందని, ప‌లు థియేట‌ర్ల యజ‌మానులు ఇప్పటికే ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశాయి.

ఈ మేర‌కు నిబంధ‌న‌లు స‌వ‌రించిన ప్రభుత్వం.. కొత్త జీవో జారీచేసింది. మరోవైపు.. సినిమా హాళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలుపై వస్తోన్న ఫిర్యాదులపై హెచ్ఎండీఏ అధికారులు స్పందించారు. సినిమా హాళ్ల వద్ద మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలుకు గతంలోనే ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. గత జూలై నెల 20వ తేదీన మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. పార్కింగ్ ఫీజు వసూలుపై తాజాగా అందిన ఫిర్యాదులపై హెచ్ఎండిఏ స్పందించింది. మరోసారి పార్కింగ్ ఫీజు అనుమతి సంబంధించిన జీవో కాపీని హెచ్ఎండిఏ రిలీజ్ చేసింది.

Read Also : Etharkkum Thunindhavan: సూర్య నెక్స్ట్ సినిమా.. థియేటర్‌లోనా.. ఓటీటీలోనా?

ట్రెండింగ్ వార్తలు