TSPSC Paper Leak Row : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ కేసు విచారణలో సిట్ స్పీడ్ పెంచింది. టీఎస్ పీఎస్ సీ సెక్రటరీ సహా ఏడుగురు సభ్యులకు నోటీసులు జారీ చేసింది సిట్. ఈ కేసులో ఏ-1గా ఉన్న ప్రవీణ్.. టీఎస్ పీఎస్ సీ సెక్రటరీకి పీఏగా ఉన్నారు. అలాగే, టీఎస్ పీఎస్ సీ సభ్యుడు లింగారెడ్డికి.. రమేశ్.. పీఏగా ఉన్నారు.
ప్రవీణ్, రమేశ్ ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సెక్రటరీ సహా నోటీసులు అందుకున్న మిగతా వాళ్లు సోమవారం విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. టీఎస్ పీఎస్ సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో సభ్యుల పాత్రపై సిట్ ఆరా తీయనుంది.(TSPSC Paper Leak)
ఇప్పటివరకు ఈ కేసులో 15మంది నిందితులను దశలవారిగా కస్టడీలోకి తీసుకుని సిట్ బృందం విచారించింది. వారి నుంచి సమాచారం సేకరించింది. తాజాగా టీఎస్ పీఎస్ సీ సెక్రటరీ, బోర్డు సభ్యులను విచారించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సెక్రటరీతో పాటు ఏడుగురు బోర్డు సభ్యులకు నోటీసులు ఇచ్చింది. వారంతా సిట్ ముందు విచారణకు హాజరై వివరాలు అందించనున్నారు.(TSPSC Paper Leak)
Also Read..TSPSC AEE Exam : రద్దైన ఏఈఈ పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ
ప్రశ్నాపత్రాలు ఎంతమందికి చేతులు మారాయి? ఎవరు లీక్ చేశారు? ప్రవీణ్, రాజశేఖర్ చరిత్ర ఏంటి? ఈ వివరాలన్నీ సిట్ సేకరించింది. 9మంది నిందితులతో పాటు తర్వాత చైన్ లింక్ గా యాడ్ అయిన 15మందిని కూడా సిట్ బృందం విచారిస్తూ వస్తోంది. మరికొన్ని రోజుల్లో నిందితుల రిమాండ్ ముగిసిపోతున్న నేపథ్యంలో చార్జిషీట్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. గ్రూప్-1 పరీక్షకు అర్హత సాధించిన 100 మంది అభ్యర్థులతో పాటు టీఎస్ పీఎస్ లో పని చేస్తున్న ఉద్యోగుల్లో కొంతమందిని ఇప్పటికే సిట్ అధికారులు విచారించడం జరిగింది.
టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం మరో మలుపు తిరిగిందని చెప్పొచ్చు. బోర్డు సెక్రటరీ, మెంబర్లను ప్రశ్నించాలని సిట్ నిర్ణయించడం హాట్ టాపిక్ గా మారింది. ఏడుగురు సభ్యుల స్టేట్ మెంట్లను సిట్ బృందం రికార్డ్ చేయనుంది. పేపర్ లీక్ వ్యవహారంలో లోతుగా దర్యాఫ్తు చేస్తున్న సిట్.. బోర్డు సభ్యుడు లింగారెడ్డి పీఏ రమేశ్ ను అరెస్ట్ చేసి విచారిస్తోంది. రమేశ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా టీఎస్ పీఎస్ సీ బోర్డు మెంబర్లను ప్రశ్నించనుంది సిట్.(TSPSC Paper Leak)